
Naga Chaitanya First Reaction After Divorce With Samantha: సమంతతో విడాకుల ప్రకటన అనంతరం నాగ చైతన్య తొలిసారిగా స్పందించారు.
Naga Chaitanya First Reaction After Divorce: టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-నాగ చైతన్య తమ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి ఎంతో మంది అభిమానులకు నిరాశ మిగిల్చారు. గత కొన్ని రోజలుగా వార్తలు వస్తున్నా అవి నిజం కాకపోతే బాగుండు అని అటు అక్కినేని అభిమానులు సహా ఎంతోమంది నెటిజన్లు కోరుకున్నారు. కానీ ఆ వార్తలనే నిజం చేస్తూ ఇక భార్య భర్తలుగా కొనసాగలేమని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చదవండి: Samantha: అందుకే సమంత విడాకులు తీసుకుందా?
ఇక విడాకుల అనంతరం వీరిద్దరి సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ పెరిగింది.ఎప్పుడు ఏం మాట్లాడతారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా విడాకుల ప్రకటన అనంతరం నాగ చైతన్య తొలిసారిగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది..లాట్స్ ఆఫ్ లవ్ అంటూ ట్వీట్ చేశారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న హాస్పిటల్ బెడ్‌పై నుంచే ట్వీట్ చేశారు. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే మీ ముందుకు వస్తా వంటూ సాయి తేజ్ ట్వీట్ చేయడంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నాగ చైతన్య సైతం సాయి తేజ్ తొందరగా కోలుకుంటున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. చదవండి: విడాకులపై స్పందించిన ఆర్జీవీ.. వైరల్ అవుతున్న ట్వీట్
So happy to see this tej !! Lots of love
— chaitanya akkineni (@chay_akkineni) October 3, 2021