
సమంత-నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గానే ఉంది. టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఎందుకు విడిపోయారన్నదానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ డివోర్స్‌కి సామ్‌కు టార్గెట్ చేస్తూ ఆ మధ్య కొందరు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. వాటికి గట్టిగానే బదులిచ్చిన సమంత తాజాగా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది.
'' నా మౌనాన్ని అజ్ఞానం అనుకోవద్దు. నేను సైలెంట్‌గా ఉన్నానంటే ఏదైనా అంగీకరిస్తానని అనుకోవద్దు. నా దయాగుణాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. దయాగుణం, మంచితనానికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది'' అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అయితే సామ్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Kindness can have an expiry date ☺️#JustSaying https://t.co/UDc40uaLpv
— Samantha (@Samanthaprabhu2) April 22, 2022