Naga Chaitanya: 'ది ఫ్యామిలీ ‍మ్యాన్‌'-2 చై-సామ్‌ విడాకులకు కారణమైందా? చై ఆన్సర్‌ ఇదే

Naga Chaitanya Intresting Comments About His Ex Wife Samantha - Sakshi

అక్కినేని నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కస్టడీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగచైతన్య తాజాగా మరోసారి సమంత గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. సమంతది చాలా కష్టపడే మనస్తత్వమని, ఏదైనా అనుకుంటే చేసి తీరుతుందంటూ ప్రశంసలు కురిపించాడు. సమంత హార్డ్‌ వర్కర్‌. పరిస్థితులు ఎలా ఉన్నా దృఢ సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తుంది.

ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది. ఆమె నటించిన ఓ బేబీ, ది ఫ్యామిలీ ‍మ్యాన్‌-2 సిరీస్‌ నాకు చాలా ఇష్టం. రీసెంట్‌గా యశోద కూడా చూశాను.ఇప్పటికీ సమంత చేసిన అన్ని సినిమాలు చూస్తాను అంటూ చై పేర్కొన్నాడు. కాగా చై-సామ్‌ల విడాకులకు ది ఫ్యామిలీ మ్యాన్‌ సిరీసే కారణమని, అందులో సామ్‌ చేసిన బోల్డ్‌ సన్నివేశాల వల్లే వీరిద్దరికి గొడవలు వచ్చాయంటూ అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అక్కినేని ఇమేజ్‌కు విరుద్దంగా సమంత ఆ సినిమాలో చాలా బోల్డ్‌గా నటించిందని, అదే విడాకులకు దారితీసిందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా నాగచైతన్య కామెంట్స్‌తో అది కేవలం పుకారు మాత్రమేనని తేలిపోయింది. 


 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top