Love Story Movie: మహేశ్‌ బాబుకు లాభాలు తెచ్చిపట్టిన లవ్‌ప్టోరీ

Naga Chaitanya And Sai Pallavi Love Story Movie Collects Rs 1 Crore At AMB Cinemas - Sakshi

సాయి పల్లవి, నాగచైతన్యల ‘లవ్‌స్టోరీ’ మూవీ రికార్డ్ స్టాయిలో కలెక్షన్స్‌ రాబడుతోంది. విడుదలై దాదాపు నెల రోజులు అవుతున్నా ఈ మూవీ ఇప్పటికె థియేటర్లో ఆడుతోంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 24 విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా సెంకడ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. కరోనా కాలంలో కూడా ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టించిన చిత్రం లవ్‌స్టోరీ రికార్డు సృష్టించింది. ఇక తొలి రోజు అయితే ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి ‘వావ్‌’ అనిపించింది.

చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత

సెకండ్ వేవ్ త‌ర్వాత విడుద‌లైన సినిమాల్లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇందులో సాయి పల్లవి డ్యాన్స్‌, నాగ చైతన్య తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. దీంతో అందరూ థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటికే థియేటర్లో ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో లవ్‌స్టోరీ దర్శక-నిర్మాతలకే కాదు థియేటర్ల యాజమాన్యాలకు సైతం లాభాలు తెచ్చిపెడుతోంది. త్వరలో ఈ మూవీ ఆహాలో విడుదలవుతున్నప్పటికీ ఈ మూవీని థియేటర్లో చూసేందుకు ఇప్పటికీ కూడా పలువురు టికెట్స్‌ బుక్‌ చేసుకుంటున్నారట.

చదవండి: నాగబాబుపై తీవ్ర విమర్శ వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు

ఈ క్రమంలో ‘లవ్‌స్టోరీ’ ఓ థియేటర్‌కు అయితే ఏకంగా కోటీ రూపాయలకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఇంతకి ఆ థియేటర్‌ ఎదో తెలుసా? అదే మన సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుకు చెందిన ఏఎంబీ(AMB) సినిమాస్ మ‌ల్టీప్లెక్స్‌. సెకండ్ వేవ్ త‌ర్వాత ఈ మల్టీప్రెక్స్‌లో కోటి రూపాయ‌లు వసూలు చేసిన తొలి చిత్రంగా లవ్‌స్టోరీ నిలిచిందట. ఇప్ప‌టివ‌ర‌కు ఏఎమ్‌బీ థియేటర్లో 251 షోలు నిర్వ‌హించ‌గా.. 48,233 మంది వీక్షించారట. ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్‌లో కోటి రూపాయ‌ల వ‌సూళ్లు సాధించిన చిత్రాలు చాలా అరుదుగా ఉంటాయ‌ని చెప్పొచ్చు. స్టార్ హీరోల‌ సినిమాలకు మాత్ర‌మే సాధ్య‌మ‌య్యే క‌లెక్ష‌న్ల‌ను సాయి ప‌ల్ల‌వి-నాగ చైతన్యల ‘లవ్‌స్టోరీ’ చిత్రం రాబ‌ట్ట‌డం విశేషం. 

చదవండి: ఘనంగా ముక్కు అవినాష్‌ పెళ్లి, ‘బ్లండర్‌ మిస్టేక్‌’ అంటూ వీడియో బయటికి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top