Kota Srinivasa Rao Sensational Comments On Nagababu At Interview - Sakshi
Sakshi News home page

Kota Srinivasa Rao: ‘నాగబాబు ఎవరూ.. మామూలు నటుడు మాత్రమే’ కోట ఫైర్‌

Oct 20 2021 7:56 PM | Updated on Oct 20 2021 8:55 PM

Kota Srinivasa Rao Sensational Comments On Nagababu In A Interview - Sakshi

Kota Srinivasa Rao Comments On Mega Brother Nagababu: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈ మధ్య పలువురు నటీనటులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఓ యుట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ యాంకర్‌ అనసూయ డ్రెస్పింగ్‌పై కోట చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతకుముందు ‘మా’ ఎన్నికల నేపథ్యంలో విష్ణుకు మద్దతు ప్రకటించిన కోట అదే సమయంలో ప్రకాశ్‌ రాజ్‌పై చేసిన తీవ్ర విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్‌ నాగబాబును ఆయన టార్గెట్‌ చేశారు. గతంలో తనపై చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ ఈ ఇంటర్య్వూలో మెగా బ్రదర్‌కు కౌంటర్‌ ఇచ్చారు.

చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత

ఈ సందర్భంగా కోట మాట్లాడుతూ.. ‘చిరంజీవి ఒక పక్క, పవన్‌ కల్యాణ్‌ మరో పక్క వీరిద్దరు లేకపోతే ఈ నాగబాబు ఎవరు?. వారే లేకపోతే నాగబాబు అనే వ్యక్తి మామూలు నటుడు మాత్రమే. అతనేం ఉత్తమ నటుడు కాదు, గొప్ప నటుడు కాదు. ఆయనకేందుకు అసలు. గతంలో నాగబాబు ప్రకాశ్‌ రాజ్‌ను తిట్టారు. అది అందరికి తెలుసు. నేను ప్రకాశ్‌ రాజ్‌ను అన్నానని ఇప్పుడు ఆయన నన్ను విమర్శించారు. అపుడు ఆయనను ఏమైనా అన్నానా? నాగబాబు నాపై చేసిన కామెంట్స్‌కు అప్పుడే నేను స్పందించి ఉంటే టీవీల్లో, చానల్లో డిబెట్‌లు అంటూ రచ్చ జరిగేది’ అంటూ కోట మండిపడ్డారు. అనంతరం ఇప్పటికి తాను అదే చెబుతానని, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ లేకపోతే నాగబాబుకు గుర్తింపు లేదన్నారు. ఒక్క మెగా బ్రదర్‌ అనే గుర్తింపు తప్పా అంటూ కోట సంచలన కామెంట్స్‌ చేశారు.

చదవండి: ఘనంగా ముక్కు అవినాష్‌ పెళ్లి, ‘బ్లండర్‌ మిస్టేక్‌’ అంటూ వీడియో బయటికి!

కాగా ‘మా’ ఎన్నికల నేపథ్యంలో కోట శ్రీనివాసరావు మంచు విష్ణుకు మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం ప్రకాశ్‌ రాజ్‌ గురించి మాట్లాడుతూ.. తాను ప్రకాశ్ రాజ్‌ కలిసి 15 సినిమాలకు పైగా నటించానని.. ఒక్కసారి కూడా ఆయన షూటింగ్‌కు సమయానికి రాలేదన్నారు. అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా గెలిపిస్తే ఏం చేస్తాడు అంటూ కోట సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కోట వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబుశాడు కోట శ్రీనివాసరావు. ఈ వ్యాఖ్య‌ల‌పై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు.. రేపోమాపో పోయే కోట ఇంకా ఎప్పుడు మారతాడు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.  దీనిపై ఇండస్ట్రీలో ఉన్న పలువురు పెద్దలు కూడా నాగబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. 

చదవండి: ప్రకాశ్‌రాజ్‌పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాస రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement