MAA Elections 2021 Date Confirmed - Sakshi
Sakshi News home page

MAA Elections: మా ఎన్నికల తేదీ ఖరారు, ఎప్పుడంటే..

Aug 25 2021 6:54 PM | Updated on Aug 26 2021 11:39 AM

Movie Artists Association Elections Will Conduct On October 10th - Sakshi

ఎన్నడూ లేని విధంగా ఈ సారి మూవీ అర్టిస్టు అసోసియేషన్‌(మా) ఎన్నికలు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఎన్నికల తేదీ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్‌ తేదీని ఖారారు చేస్తూ తాజాగా ‘మా’ క్రమ శిక్షణ కమిటీ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది.

దీంతో అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థులు, వారి ప్యానెల్‌ సభ్యులు ప్రచారం ముమ్మరం చేయనున్నారు. చివరి వరకూ ఎవరు పోటీలో ఉంటారు? ఎవరు విజయం సాధిస్తారు? అన్నదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహారావు, హేమలు ఉన్న సంగతి తెలిసిందే. 

చదవండి: ‘మా’ బిల్డింగ్‌ నిర్మాణంపై మోహన్‌ బాబు సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement