'I Tore Rakesh Roshan's Visiting Card And Threw It Away': Monica Bedi - Sakshi
Sakshi News home page

Monica Bedi: ప్చ్‌.. పిలవగానే వెళ్లుంటే హీరోయిన్‌ ఛాన్స్‌ వచ్చేది.. ఏడాదిన్నర సినిమాల్లేక ఇంట్లో ఖాళీగా కూర్చున్నా..

Jul 14 2023 1:05 PM | Updated on Jul 14 2023 1:31 PM

Monica Bedi: I Tore Rakesh Roshan Visiting Card and Threw it Away - Sakshi

అతడు కాసేపు మాట్లాడాక విజిటింగ్‌ కార్డు ఇచ్చి రేపు ఒకసారి కలువు అని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు.

తెలుగు సినిమా తాజ్‌ మహల్‌తో వెండితెరకు పరిచయమైంది మోనికా బేడీ. ఆ తర్వాత 1995లో వచ్చిన సురక్ష చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అక్కడే సినిమాలు చేసుకుంటూ బీ టౌన్‌లోనే సెటిలైపోయిన మోనికా తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. 'దర్శకుడు సుభాష్‌ ఘై హోలీ పార్టీలో రాకేశ్‌ రోషన్‌ నా దగ్గరకు వచ్చాడు. అతడు నటుడన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే అతడు యాక్ట్‌ చేసిన కొన్ని సినిమాలు చూశాను.

కానీ అతడు దర్శకుడు, నిర్మాత కూడా అన్న విషయం మాత్రం తెలియదు. అతడు కాసేపు మాట్లాడాక విజిటింగ్‌ కార్డు ఇచ్చి రేపు ఒకసారి కలువు అని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. ఇతడు నన్నెందుకు రమ్మంటున్నాడు అని అనుమానించి ఆ కార్డును ముక్కలు ముక్కలు చేసి పడేశాను. కొన్ని నెలల తర్వాత నా మేనేజర్‌.. ఎందుకు రాకేశ్‌ను కలవలేదు? అని అడిగాడు. అతడు కరణ్‌ అర్జున్‌ సినిమా తీస్తున్నాడు.

ఇందులో నీకు హీరోయిన్‌ ఛాన్స్‌ ఇవ్వాలనుకున్నాడు. సల్మాన్‌ ఖాన్‌ సరసన మమత కులకర్ణి నటిస్తున్న రోల్‌ నువ్వు చేయాల్సింది అని చెప్పాడు. అప్పుడు కానీ నేను చేసిన తప్పు అర్థం కాలేదు. డైరెక్టర్‌, నటుడు మనోజ్‌ కుమార్‌ కూడా తన కొడుతో తీస్తున్న సినిమాకు నన్ను సంప్రదించాడు. నాకు చాలా సంతోషమేసింది. కానీ తన సినిమా పూర్తయ్యేవరకు మరే సినిమా చేయడానికి వీల్లేదని అగ్రిమెంట్‌ మీద సంతకం చేయించుకున్నాడు. అయితే ఆ సినిమా వర్కవుట్‌ కాలేదు.

అసలు షూటింగే జరగలేదు. ఇది అతడి తప్పు కాదు. కొన్ని సార్లు మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరగవంతే! అయితే ఈ అగ్రిమెంట్‌ వల్ల నేను ఏడాదిన్నరపాటు ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాను. ఆ తర్వాత సినిమా అయ్యేలా లేదని గ్రహించిన మనోజ్‌ తన కాంట్రాక్ట్‌ నుంచి నాకు విముక్తి కల్పించాడు' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే మోనిక హిందీ బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లోనూ పాల్గొంది. ఝలక్‌ దిక్‌లాజా మూడో సీజన్‌లోనూ పార్టిసిపేట్‌ చేసింది.

చదవండి: నాగార్జున బ్లాక్‌బస్టర్‌ మూవీ.. ఆ డైరెక్టర్‌ను గుర్తుపట్టారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement