Mohan Lal: 20 మంది విద్యార్థులకు 15 ఏళ్లపాటు ఉచిత విద్య..

Mohan Lal Vintage Project Provide 20 Students 15 Years Free Education - Sakshi

Mohan Lal Vintage Project Provide 20 Students 15 Years Free Education: ప్రముఖ నటుడు మోహన్‌ లాల్‌ తన విలక్షణ నటనతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ ఉంటారు. సినిమాలతో అలరిస్తున్న ఈ కంప్లీట్‌ యాక్టర్ తన పెద్ద మనసుతో ఉదారత చాటుకున్నారు. ఏకంగా 20 మంది విద్యార్థులకు 15 ఏళ్ల పాటు ఉచిత విద్యను అందించడానికి ముందుకు వచ్చారు. గిరిజన తెగకు చెందిన 20 మంది స్టూడెంట్స్‌ను సెలెక్ట్‌ చేసుకుని 15 ఏళ్ల పాటు వారి చదువుకయ్యే ఖర్చులను భరించనున్నారు. ఈ విద్యకు అయ్యే ఖర్చును 'విశ్వశాంతి ఫౌండేషన్‌'కు చెందిన వింటేజ్‌ పతకం ద్వారా చెల్లించనున్నారు. అలాగే వారికి నచ్చిన కోర్సుల్లో చదివిస్తామని విశ్వశాంతి ఫౌండేషన్‌ ప్రకటించింది.

మొదటి దశగా ఈ ఏడాది 20 మందిని ఎంపిక చేశామని మోహన్ లాల్ తెలిపారు.  'విశ్వశాంతి ఫౌండేషన్‌ చొరవతో 'వింటేజ్‌' ప్రాజెక్ట్‌ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రయత్నంలో మేము అట్టప్పాడికి చెందిన గిరిజన గ్రామాల్లో ఆరో తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులను స్పెషల్‌ క్యాంప్స్ ద్వారా సెలెక్ట్ చేశాం. వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచేందుకు వచ్చే 15 ఏళ్లు ఉత్తమ విద్య, వనరులు అందిస్తాం. ఈ ప్రాజెక్టులో మద్దతు ఇచ్చిన ఈవై గ్లోబల్‌ డెలివరీ సర్వీసెస్ కెరీర్స్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పిల్లలకు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సవినయంగా కోరుకుంటున్నాం.' అంటూ ఫేస్‌బుక్‌ పేజీలో మోహన్‌ లాల్‌ పేర్కొన్నారు. 

చదవండి: ఒకే ఫ్రేమ్‌లో మోహన్‌లాల్‌, మల్లిక.. డైరెక్టర్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top