దృశ్యం-3 వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే | Mohan Lal Drishyam 3 Release date Post Poned | Sakshi
Sakshi News home page

Drishyam 3 Release date: దృశ్యం-3 వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే

Mar 23 2026 9:30 PM | Updated on Mar 23 2026 9:33 PM

Mohan Lal Drishyam 3 Release date Post Poned

మలయాళంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ దృశ్యం. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం-2 సైతం అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ సిరీస్‌లో దృశ్యం-3 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ మూవీకి జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా దృశ్యం-3 మేకర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీ రిలీజ్‌ వాయిదా పడినట్లు మోహన్ లాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఏడాది మే 21 దృశ్యం-3 విడుదల కానుందని హీరో ట్వీట్ చేశారు. కాగా.. మొదట ఏప్రిల్ 02న విడుదల కానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అంతేకాకుండా ఈ మూవీని తెలుగుతో పాటు హిందీలోనూ రీమేక్ చేయనున్నారు. తెలుగులో వెంకటేశ్ హీరోగా కనిపించనుండగా.. హిందీలో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు.  హిందీ దృశ్యం3 కూడా షూటింగ్‌ శరవేగంగా జరుపుకొంటోంది. ఈ మూవీ అక్టోబరు 2న విడుదల కానుంది. కాగా..ఈ చిత్రాన్ని ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోని పెరంబవూర్‌ నిర్మించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement