12th Man Movie Review In Telugu: మోహన్‌ లాల్‌ '12th మ్యాన్‌' రివ్యూ.. ఎలా ఉందంటే ?

Mohan Lal 12th Man Movie Review In Telugu - Sakshi

టైటిల్‌: 12th మ్యాన్‌ (మలయాళం)
నటీనటులు: మోహన్‌ లాల్‌, ఉన్ని ముకుందన్‌, అనుశ్రీ, అదితి రవి, రాహుల్ మాధవ్‌, లియోనా లిషాయ్‌ తదితరులు
కథ: కెఆర్. కృష్ణ కుమార్‌
దర్శకుడు: జీతూ జోసేఫ్‌
సంగీతం: అనిల్‌ జాన్సన్‌
సినిమాటోగ్రఫీ: సతీష్‌ కురూప్‌
నిర్మాత: ఆంటోనీ పెరుంబవూరు
విడుదల తేది: మే 20, 2022, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

విలక్షణ నటుడు, మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్ లాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథ నచ్చితే తన పాత్ర కోసం ఎంతైనా శ్రమిస్తారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం '12th మ్యాన్‌'. దృశ్యం, దృశ్యం 2 సినిమాల డైరెక్టర్‌ జీతూ జోసేఫ్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మోహన్‌ లాల్‌-జీతూ జేసేఫ్‌ కాంబోలో ముచ్చటగా మూడోసారి వచ్చింది ఈ చిత్రం. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే పెరిగాయి. అదేకాకుండా ఇదివరకు విడుదలైన సినిమా ట్రైలర్‌ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచెలా ఉంది. అయితే ఎట్టకేలకు శుక్రవారం (మే 20) నేరుగా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైన '12th మ్యాన్' (12th Man Movie) ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథ:
11 మంది స్నేహితులు తమ ఫ్రెండ్‌ సిద్ధార్థ్‌ (అను మోహన్‌) బ్యాచ్‌లర్‌ పార్టీకి వారి భార్యలతో కలిసి ఒక రిసార్ట్‌కు వెళ్తారు. ఈ 11 మందిలో ఇప్పుడు పెళ్లి చేసుకునే జంటతో (ఇద్దరు) పాటు నలుగురు దంపతులు (8 మంది), ఒక పెళ్లి అయి భర్తతో సెపరేట్‌ అయిన మహిళ ఉంటారు. వీరందరు కలిసి బ్యాచ్‌లర్‌ పార్టీ బాగా ఎంజాయ్‌ చేద్దామనుకుంటారు. పార్టీలో భాగంగా మొబైల్‌ ఫోన్స్‌తో ఒక గేమ్‌ ఆడతారు. ఆ గేమ్ కాస్తా వారిలోని రహస్యాలను బయటపెడుతుంది. దీంతో ఆ సముహాంలో ఒక అనుమానం, గందరగోళం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఆ 11 మందిలో మాథ్యూ (సైజు కురూప్‌) భార్య షైనీ (అనుశ్రీ) అనుమానస్పదంగా చనిపోతుంది. షైనీ ఎలా చనిపోయింది ? హత్యా ? ఆత్మహత్య ? వారికి ఎదురైన అనుమానం ఏంటీ ?  ఆ 11 మందితో కలుస్తానన్న 12వ మనిషి చంద్రశేఖర్‌ (మోహన్‌ లాల్‌) ఎవరు ? అనేది తెలియాలంటే '12th మ్యాన్‌' మూవీ చూడాల్సిందే. 

విశ్లేషణ:
ఇది ఒక క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌. దృశ్యం సిరీస్‌తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్‌ జీతూ జోసేఫ్‌ మళ్లీ అదే తరహాలో ఈ సినిమాను తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్‌ను ఎలా సస్పెన్సింగ్‌గా చూపెట్టాలో బాగా తెలిసిన దర్శకుడు జీతూ. ఈ మూవీని ఆద్యంతం థ్రిల్లింగ్‌, సస్పెన్సింగ్‌గా చూపెట్టడంలో నూటికి నూరు శాతం విజయం సాధించారు. 11 మంది పాత్రల పరిచయంతో ప్రారంభమైన సినిమా తాగుబోతుగా ఎంట్రీ ఇచ్చిన మోహన్‌ లాల్‌తో ఆసక్తిగా మారుతుంది. బ్యాచ్‌లర్‌ పార్టీలో మొబైల్‌ ఫోన్స్‌ గేమ్‌ ఆడతారు. ఈ గేమ్‌లో బ్యాచ్‌లర్‌ పార్టీ ఇస్తున్న సిద్ధార్థ్‌కు వచ్చిన ఫోన్‌ కాల్‌తో తన రహస్యం ఒకటి బయటపడుతుంది. దీంతో ఆ ఫ్రెండ్స్‌ మధ్య ఒక గందరగోళం, అనుమానం ఏర్పడుతుంది. ఇంతలో వారి ఫ్రెండ్‌ భార్య షైనీ చనిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. 

ఇక్కడ మోహన్‌ లాల్‌ గురించి ఒక విషయం రివీల్‌ అవుతుంది. అది ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది తప్ప మూవీలో మరే ట్విస్ట్‌లు ఏం లేకపోయినా ఒక్కొక్కరు తమ హిడెన్‌ సీక్రెట్స్‌ (నిజాలను) బయటపెట్టడం ఆద్యంతం ఉత్కంఠంగా, ఆసక్తిరకంగా ఉంటుంది. సినిమా రన్‌ టైమ్‌ కొంచెం ఎక్కువగానే 2 గంటల 42 నిమిషాలు ఉంటుంది. షైనీది హత్య ? ఆత్మహత్య ? అనేది చివరి వరకు తేలేదాకా ఎంతో గ్రిప్పింగ్‌గా నారేట్‌ చేశారు. దృశ్యం, దృశ్యం 2 తరహాలో స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంది. సస్పెన్స్‌ను క్రియేట్‌ చేసేలా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా చక్కగా కుదిరింది. 

ఎవరెలా చేశారంటే ?
తాగుబోతుగా, మరొక రోల్‌లో మోహన్‌ లాల్‌ అదరగొట్టారు. ఆయన ఆక్టింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేనేలేదు. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన వారంతా సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చారనే చెప్పవచ్చు. సినిమాకు కథ, కథనం పాత్రల నటన, బీజీఎం, సినిమాటోగ్రఫీ ప్రధాన బలం. సినిమా కథ అంతా ఒకే రోజు జరుగుతుంది. సినిమా ప్రారంభం నుంచే కథలో లీనమయ్యేలా తరెకెక్కించారు డైరెక్టర్‌ జీతూ. అప్పుడేల ఒక నిజం చెప్పడం.. అంతలోనే అది అబద్ధం అని తేలడం ఎంతో థ్రిల్లింగ్‌గా డైరెక్ట్‌ చేశారనే చెప్పవచ్చు. ఓవరాల్‌గా చెప్పాలంటే 'దృశ్యం' సిరీస్‌లా మంచి సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చూడాలనుకుంటే '12th మ్యాన్‌' సినిమాను కచ్చితంగా ట్రై చేయాల్సిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top