మగాళ్లలో మార్పు తీసుకొచ్చేలా ‘ఫిమేల్‌’ ఉండాలి: మంత్రి సబితా

Minister Sabitha Indra Reddy Launched Title Poster Of Female Movie - Sakshi

మంత్రి సబితా చేతుల మీదుగా ‘ఫిమేల్‌’ టైటిల్ రివీలింగ్ పోస్టర్

మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో రూపొందిన ‘ఫీమేల్‌’ చిత్రం  మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడాలని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వీపీఆర్‌ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  నాని తిక్కిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ..వెలిచర్ల ప్రదీప్ రెడ్డి తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం ‘ఫిమేల్’. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ రివేలింగ్ పోస్టర్ ను తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మగాళ్లలో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ చిత్రం ఉండాలని ఆమె ఆకాంక్షించారు. దర్శకుడు నాని తిక్కిశెట్టి, నిర్మాత వెలిచర్ల ప్రదీప్ రెడ్డి మరియు చిత్రబృందానికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. శుభాంగి తంభాలే టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ బేబీ దీవెన, దీపిక, తమన్నా సింహాద్రి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహిళల పట్ల జరుగుతున్న దారుణాలపై విప్లవాత్మకమైన పరిష్కారాన్ని సూచిస్తూ రూపొందిన ఈ విభిన్న కథాచిత్రం త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top