సత్యదేవ్‌ సరసన మేఘా ఆకాశ్‌

Megha Akash To Pair Up With Satyadev For A Telugu Movie - Sakshi

ఈ మధ్యకాలంలో సినిమా కంటెంట్‌కే బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. అది స్టార్‌ హీరో సినిమానా. . పెద్ద డైరెక్టర్‌ తీస్తున్నాడా.. భారీ బడ్జెట్‌తో తీస్తే బ్లాక్‌బస్టరే.. అనుకునే రోజులకు కాలం చెల్లిపోయింది. కంటెంట్‌ బాగుంటే ఇవేమీ ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. అలాంటి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది  ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మూవీ లవర్స్‌ టేస్ట్‌ని బట్టే నడుచుకుంటున్నారు మేకర్స్‌ కూడా. అలాగే కథలో దమ్ముంటే ఎవరితో నటించడానికైనా, ఏ బ్యానర్‌లో సినిమా తీస్తున్నా ఓకే అంటున్నారు నటీనటులు. అలాంటి కాంబినేషన్‌లు కూడా బాగానే వర్కవుట్‌ అవుతున్నాయి.  

తాజాగా సత్యదేవ్‌, తమన్నా కూడా ఓ సినిమాలో జోడీ కడుతున్నారు.  ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాతో ఈ జంట ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. దీనికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ని సెప్టెంబర్‌లోనే విడుదల చేసింది మూవీ టీమ్‌. అది మూవీ లవర్స్‌ను బాగానే ఆకట్టుకుంది. ఇక​ పలు కన్నడ చిత్రాలతో శాండిల్‌వుడ్‌లో తనేంటో నిరూపించుకున్న నాగశేఖర్‌ ‘గుర్తుందా శీతాకాలం’తో టాలీవుడ్‌లోకి అడుగు పెడతున్నాడు. 

ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక అప్‌డేట్‌ బయటికి వచ్చింది. ఒక కీలక పాత్ర కోసం తమిళ ముద్దుగుమ్మ మేఘా ఆకాశ్‌ను తీసుకుంటున్నారట. ఈ ఏడాది కన్నడలో రిలీజ్‌ అయ్యి హిట్‌ కొట్టిన లవ్‌ మాక్‌టెయిల్‌కు రీమేక్‌ ఈ చిత్రం. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉండగా ఇప్పటికే ఇద్దరు ఫైనల్‌ అయ్యారు. అయితే కొద్దిరోజుల క్రితం బడ్జెట్‌ సమస్యలతో సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చినా అవన్నీ పుకార్లని తేలిపోయింది. షూటింగ్‌ త్వరగా ముగించుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నారు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top