Megastar Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్, భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం తెలుగు రీమేక్ ఇది. చిరంజీవి కెరీర్లో 154వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా తమన్నా, చిరు చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, యాంకర్ శ్రీముఖి తదితరులు నటిస్తున్నారు.
చదవండి: తొలి రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన ఆలియా, ఆ చెక్‌తో ఏం చేసిందంటే
అయితే రేపు(ఆగస్ట్ 22) చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టీం అదిరిపోయే అప్‌డేట్‌ను వదలింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఖరారు చేసి తాజాగా ప్రకటించింది చిత్ర బృందం. ఏప్రిల్ 14, 2023లో సమ్మర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
చదవండి: కార్తికేయ 2 సక్సెస్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక
Wishing The Swagster of INDIAN CINEMA Mega 🌟 @KChiruTweets
A Very Happy Birthday ❤️🔥#BholaaShankar 🔱 ARRIVING in theatres Worldwide on 14th April,2023 🤘#HBDMegastarChiranjeevi@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/mxfWLMnrK3— BholāShankar (@BholaaShankar) August 21, 2022