భగవంత్‌ కేసరి కలెక్షన్స్‌: చిరంజీవి డిజాస్టర్‌ మూవీని దాటలేకపోయిన బాలకృష్ణ | Nandamuri Balakrishna Bhagavanth Kesari Movie First Day Box Office Collections, Deets Inside - Sakshi
Sakshi News home page

Bhagavanth Kesari Day 1 Collections: హిట్‌ టాక్‌.. అయినా భోళా శంకర్‌ను బీట్‌ చేయలేకపోయిన భగవంత్‌ కేసరి.. తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే?

Published Fri, Oct 20 2023 2:02 PM

Nandamuri Balakrishna Bhagavanth Kesari Movie First Day Collection - Sakshi

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భగవంత్‌ కేసరి. అందాల చందమామ కాజల్‌ హీరోయిన్‌గా నటించింది. కుర్ర హీరోయిన్‌ శ్రీలీల.. బాలకృష్ణ కూతురి పాత్రను పోషించింది. దర్శకుడు అనిల్‌ రావిపూడి.. కామెడీ జానర్‌ను వదిలేసి ఎమోషనల్‌ కంటెంట్‌ను ఎంచుకున్నాడు. బాలయ్యను సరికొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై హరీశ్‌ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీకి తమన్‌ సంగీతం అందించాడు.

అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. తాజాగా ఈ మూవీ తొలి రోజు వసూళ్ల సంఖ్యను నిర్మాణ సంస్థ బయటపెట్టింది. భగవంత్‌ కేసరి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.32.33 కోట్లు రాబట్టిందని వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేసింది. అయితే భగవంత్‌ కేసరి బాక్సాఫీస్‌ దగ్గర గట్టిగానే చప్పుడు చేశాడు.. కానీ మెగాస్టార్‌ చిరంజీవి భోళా శంకర్‌ మొదటి రోజు కలెక్షన్స్‌ను మాత్రం బ్రేక్‌ చేయలేకపోయాడు.

భోళా శంకర్‌ మొదటి రోజు రూ.33 కోట్లు రాబట్టగా భగవంత్‌ కేసరి మాత్రం రూ.32.33 కోట్ల దాకా వచ్చి అడుగు దూరంలో ఆగిపోయింది. హిట్‌ టాక్‌ ఉన్న భగవంత్‌ కేసరి.. డిజాస్టర్‌గా నిలిచిన భోళా శంకర్‌ వసూళ్లను బ్రేక్‌ చేయలేకపోయిందని సోషల్‌ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

చదవండి: ‘భగవంత్‌ కేసరి’ మూవీ రివ్యూ

Advertisement
 

తప్పక చదవండి

Advertisement