Manjima Mohan Finally Opened on Love Affair With Gautham Karthik - Sakshi
Sakshi News home page

Manjima Mohan: యంగ్‌ హీరోతో ప్రేమ పుకార్లపై స్పందించిన హీరోయిన్‌

Mar 19 2022 6:57 PM | Updated on Mar 19 2022 7:39 PM

Manjima Mohan Finally Opened Up on Love Affair With Gautham Karthik - Sakshi

ప్రేమను అంగీకరించలేదని వెల్లడించింది. తన జీవితంలోని ముఖ్యమైన విషయాలను దాచే అవసరం తనకు లేదని పేర్కొంది. నిజంగా ప్రేమలో ఉంటే తప్పకుండా దాన్ని అందరికీ తెలియజేస్తానంది. అంతేతప్ప ప్రేమ, పెళ్లిలాంటి పెద్దపెద్ద విషయాలను సీక్రెట్‌గా ఉంచనని చెప్పుకొచ్చింది.

తమిళ హీరో గౌతమ్‌ కార్తీక్‌, హీరోయిన్‌ మంజిమా మోహన్‌ లవ్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్న తరుణంలో ఈ వార్తలకు చెక్‌ పెట్టింది హీరోయిన్‌. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్‌ ప్రేమను అంగీకరించలేదని వెల్లడించింది. తన జీవితంలోని ముఖ్యమైన విషయాలను దాచే అవసరం తనకు లేదని పేర్కొంది. నిజంగా ప్రేమలో ఉంటే తప్పకుండా దాన్ని అందరికీ తెలియజేస్తానంది. అంతేతప్ప ప్రేమ, పెళ్లిలాంటి పెద్దపెద్ద విషయాలను సీక్రెట్‌గా ఉంచనని చెప్పుకొచ్చింది.

చదవండి: 'నా మాజీ భర్తకు స్పాలో పనిచేసే మహిళతో అక్రమ సంబంధం'

మొదట్లో.. గౌతమ్‌తో పెళ్లి అంటూ వచ్చి వార్తలు చూసి షాకయ్యానన్న మంజిమ దీనిపై తన పేరెంట్స్‌ ఎలా స్పందిస్తారోనని భయపడ్డానని, కానీ వారు దీన్ని తేలికగా తీసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నానని చెప్పింది. కాగా అలనాటి హీరో నవరస నయగన్‌ కార్తీక్‌ తనయుడే గౌతమ్‌ కార్తీక్‌. ప్రస్తుతం అతడు తమిళంలో హీరోగా బిజీగా ఉన్నాడు. మంజిమ మోహన్‌ విషయానికి వస్తే 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల ఎఫ్‌ఐఆర్‌ సినిమాతోనూ ఆకట్టుకుంది. గౌతమ్‌, మంజిమ దేవరత్తమ్‌ సినిమాలో కలిసి నటించారు.

చదవండి: Allu Arjun: టీమ్‌ మెంబర్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన బన్నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement