Santhosh Shoban: వాళ్లకు రుణపడి ఉంటానన్న శోభన్‌

Manchi Rojulochaie Movie Characters Intro Video Released - Sakshi

Manchi Rojulochaie: ‘‘కరోనా సమయంలో అందరం నవ్వుకు దూరం అయిపోయాం. కరోనా రాకపోయినా భయంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు చూసి ‘మంచి రోజలు వచ్చాయి’ సినిమా తీశాను’’ అని డైరెక్టర్‌ మారుతి అన్నారు. సంతోష్‌ శోభన్, మెహరీన్‌ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్, మాస్‌ మూవీ మేకర్స్‌ పతాకాలపై వి సెల్యూలాయిడ్, ఎస్‌కేఎన్‌ నిర్మించిన ఈ సినిమా క్యారెక్టర్‌ లుక్‌ వీడియోను రిలీజ్‌ చేశారు.

మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఎలాంటి భయం లేకుండా థియేటర్లకు వచ్చి మా ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా చూస్తారని, అలాంటి మంచి రోజులు అతి త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. కరోనా ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా జర్నలిస్టులను కూడా చేర్చాలి’’ అన్నారు ఎస్‌కేఎన్‌. ‘‘మా చిత్రాన్ని చూసి ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు మెహరీన్‌. ‘‘నా ప్రతిభని నమ్మి ప్రోత్సహించిన నిర్మాతలు వంశీగారు, విక్రమ్‌గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు సంతోష్‌ శోభన్‌. నటుడు అజయ్‌ ఘోష్‌ మాట్లాడారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top