
Manam Saitham Founder Kadambari Kiran Met CM KCR: రాజకీయనాయకులు, సినీ సెలబ్రిటీలకు మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒకరివేడుకల్లో ఒకరు పాల్గొంటూ అనుబంధాలు పెంచుకోవడం పరిపాటే. టాలీవుడ్ నటుడు, 'మనం సైతం' వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కలిశారు. డిసెంబర్ 8న జరగనున్న తమ కుమార్తె వివహ మహోత్సవానికి రావల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. అలాగే 'మనం సైతం' ద్వారా సమాజహితం కోసం నిరంతరం అందిస్తున్న సేవా కార్యక‍్రమాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు కాదంబరి కిరణ్.
కాదంబరి కిరణ్ ఎక్కువగా హాస్యప్రాధాన్యమున్న పాత్రల్లో నటించారు. ఇప్పటికీ 270 సినిమాల్లో నటించారు. 'అమ్మ నాన్న తమిళ అమ్మాయి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో 'మనం సైతం' సంస్థ ఏర్పాటు చేసి అనేక సేవా కార‍్యక‍్రమాలు అందిస్తున్నారు. గతంలో టీఆర్‌ఎస్ పార్టీకి కాదంబరి కిరణ్ మద్దతు కూడా ఇచ్చారు. కాదంబరి కిరణ్ ఒక్కాగానొక్క కుమార్తె శ్రీకృతి వివాహం డిసెంబర్ 8న నిర్వహించనున్నారు.