వాళా-2 సూపర్ హిట్‌.. పార్ట్-3 అధికారిక ప్రకటన | Malayalam Super Hit Movie Vaazha 3 announced shoot begins next year | Sakshi
Sakshi News home page

Vaazha 3 Announcement: వాళా-3 అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరంటే?

Apr 14 2026 3:32 PM | Updated on Apr 14 2026 4:20 PM

Malayalam Super Hit Movie Vaazha 3 announced shoot begins next year

ఇటీవల విడుదలైన మలయాళ  చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ మూవీ రిలీజైన పది రోజుల్లోనే టాప్‌-6లో నిలిచింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఆరో స్థానం సాధించింది. ఏప్రిల్‌ 2న రిలీజైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 163.50 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్‌తో ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' మూవీని అధిగమించింది.

ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి వాళా-3 మూవీని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీకి వాళా-3.. ఏ బయోపిక్ ఆఫ్ బిలియన్ గర్ల్స్‌ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి విపిన్ దాస్ కథను అందించనుండగా.. విశ్వాస్ శ్రీజిత్ దర్శకత్వం వహించనున్నారు. 

హిట్‌ మూవీకి సీక్వెల్‌..

2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్‌గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్‌ ఆఫ్‌ బిలియన్‌ బ్రోస్‌' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్‌ దాస్‌ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్‌ మీనన్‌ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్‌ డైరెక్ట్‌ చేశాడు. సీక్వెల్‌కు రూ.10 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ నుంచి సాహు గారపాటి నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement