vaazha Movie
-
వాళా-2 సూపర్ హిట్.. పార్ట్-3 అధికారిక ప్రకటన
ఇటీవల విడుదలైన మలయాళ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ మూవీ రిలీజైన పది రోజుల్లోనే టాప్-6లో నిలిచింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఆరో స్థానం సాధించింది. ఏప్రిల్ 2న రిలీజైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 163.50 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్‌తో ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' మూవీని అధిగమించింది.ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి వాళా-3 మూవీని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీకి వాళా-3.. ఏ బయోపిక్ ఆఫ్ బిలియన్ గర్ల్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి విపిన్ దాస్ కథను అందించనుండగా.. విశ్వాస్ శ్రీజిత్ దర్శకత్వం వహించనున్నారు. హిట్ మూవీకి సీక్వెల్..2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్‌గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్ దాస్ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్‌కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ నుంచి సాహు గారపాటి నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. #Vaazha3 - Biopic of a Billion Girls.The #Vaazha franchise continues its journey of introducing fresh talent and new voices to cinema. Production begins next year. pic.twitter.com/YcHanDL3Q6— Shine Screens (@Shine_Screens) April 14, 2026 -
చిన్న సినిమా ఘన విజయం.. వారం రోజుల్లోనే సెంచరీ
మలయాళంలో రెండేళ్ల క్రితం సంచలన విజయం సాధించిన చిత్రాల్లో "వాళా" ఒకటి. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.40 కోట్లు వసూలు చేసింది. వాళా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. అలాగే పనీపాటా లేకుండా తిరిగే సోమరులని కూడా అదే పేరుతో పిలుస్తారు. వాళా చిత్రానికి 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్' అనేది ట్యాగ్‌లైన్ ఇచ్చారు.మలయాళంలో హిట్ కొట్టిన తెలుగు డైరెక్టర్2024లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్ దాస్ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్‌కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరిగా ఉన్నాడు. సెంచరీ కొట్టిన వాళా 2ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం ఏకంగా సెంచరీ కొట్టింది. కేవలం వారం రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోవడం విశేషం. ఈ ఏడాది మన శంకరవరప్రసాద్‌గారుతో హిట్ అందుకున్న సాహు గారపాటి.. మూడు నెలల్లో వాళా 2తో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. కాగా వాళా మొదటి భాగం హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. View this post on Instagram A post shared by Vaazha-2 Movie (@vaazhamovie) చదవండి: గాయపర్చుకున్న హీరో.. కదల్లేని స్థితిలో ఉంటే.. -
పిల్లలకో పాఠం.. పెద్దలకో గుణపాఠం
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం వాళ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.‘వాళ’ తప్పనిసరిగా తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూడవలసిన సినిమా. మనిషి జీవితంలో యవ్వన దశకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పిల్లలకు మాత్రం బళ్లో, ఊళ్లో సరదాగా స్నేహితులతో గడిచిపోయే స్థితి అది. కానీ తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లల యవ్వన దశ అనేది కత్తి మీద సాములాంటిదే. పిల్లల భవిష్యత్తు పై ఆశతో అతి గారాబంగా తమ పిల్లలను చూసుకునేవారు కొందరైతే, తమ పిల్లలు దేనికీ పనికి రారని మరికొందరు వారి యవ్వన దశను వారికి అనుగుణంగా అనుభవించనీయకుండా చేస్తుంటారు. సరిగ్గా అలాంటి వారికే ఈ ‘వాళ’ సినిమా. ‘బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్’ అన్నది దీని ట్యాగ్ లైన్. ఈ ట్యాగ్ లైన్ సినిమాకి సరిగ్గా సరిపోవడమే కాదు, నిజ జీవితంలో యవ్వన దశ దాటిన ప్రతి ఒక్కరికీ రిలేట్ అవుతుంది. ఈ సినిమాకి దర్శకుడు ఆనంద్ మీనన్. ప్రముఖ నటుడు బసిల్ జోసెఫ్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... తమ కెరీర్ పరంగా ఓడిపోయిన నలుగురు స్నేహితుల కథ ఇది. ఈ నలుగురూ తమ స్కూల్ నుండి కాలేజ్ వరకు చేసే ప్రయాణం చూసే ప్రతి ప్రేక్షకుడి యవ్వనాన్ని తప్పకుండా గుర్తు చేస్తుంది. ఈ నలుగురూ స్కూల్, కాలేజ్ అన్నింటిలోనూ ఫెయిలవుతారు. కానీ ఆ ఫెయిలైన వాళ్లు తమ తల్లిదండ్రులకు మాత్రం సినిమా ఆఖర్లో చక్కటి సందేశమిస్తూ అదే తల్లిదండ్రుల దృష్టిలో పాస్ అవుతారు. అసలు ఈ పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతారు, పరీక్షలో కాకుండా తల్లిదండ్రుల విషయంలో ఎలా పాస్ అవుతారన్నది మాత్రం ఈ సినిమాలోనే చూడాలి. తామొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు తమ పిల్లలు వాళ్ల కెరీర్‌ని ఎలా ఎంచుకుంటారు అన్నది వాళ్లకే వదిలేయాలి కానీ తమ ఆలోచనలను వాళ్ల మీద రుద్దకూడదన్న అంశం మీద తీసిన ఈ సినిమా నిజంగా అభినందనీయం. తీసుకున్న పాయింట్ సీరియస్‌దే అయినా సినిమా మొత్తాన్ని చక్కటి స్క్రీన్‌ప్లేతో మంచి కామెడీని మేళవించి కుటుంబమంతా కలిసి చూసే విధంగా రూపొందించారు దర్శకుడు. మనం వినోదం కోసం ఎన్నో సినిమాలు చూస్తాం. కానీ కొన్ని సినిమాలు మనకు మార్గదర్శకమవుతాయి. అటువంటి సినిమానే ఈ ‘వాళ... బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్’... మస్ట్ వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలో ప్రతివారం పదులకొద్దీ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలా తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన మలయాళ సినిమా 'వాళా'. కేవలం రూ.4 కోట్లు పెట్టి తీస్తే రూ.40 కోట్లు వసూలు చేసిందీ చిన్న సినిమా. మలయాళంలో సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేశారు. బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?విష్ణు, అజు థామస్, మూస అనే ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎప్పుడు అల్లరి చేస్తూ తల్లిదండ్రులకు తలనొప్పులు తీసుకొస్తుంటారు. వీళ్లకు కలామ్, వివేక్ ఆనంద్ అనే మరో ఇద్దరు ఫ్రెండ్స్ తోడవుతారు. వీళ్లంతా ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. మొదటిరోజే పెద్ద గొడవ పెట్టుకుంటారు. ఏకంగా లెక్చరర్ని కూడా కొట్టేస్తారు. అలా ఆడుతూ పాడుతూ సాగిపోతున్న వీళ్లు.. ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో పట్టుబడతారు. మరి వీళ్లు బయటపడ్డారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే ఆ వయసులో చేసే అల్లరి, హంగామా అలా ఉంటుంది మరి. చదువు బిడ్డల సంగతి పక్కనబెడితే ఆవారాగా తిరిగే బ్యాచ్‌లు కూడా ఉంటాయి. అలాంటి ఓ బ్యాచ్ కథే 'వాళా'. చూస్తే సింపుల్ కథనే గానీ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. 90ల జ్ఞాపకాలు, టీనేజీ అల్లర్లు, గొడవలు, తల్లిదండ్రులు మాట వినకపోవడం లాంటి సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. కానీ ఇందులో మాత్రం ఇంచుమించు అలానే ఉన్నప్పటికీ హాయిగా నవ్వుకునేలా చేస్తాయి.కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనగానే దాదాపు ప్రతి దర్శకుడు కుర్రాళ్ల వైపు నుంచే కథ చెబుతారు. కానీ ఇందులో మాత్రం ఇటు కుర్రాళ్ల వైపు నుంచి నవ్విస్తూనే తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూపించారు. పిల్లల వల్ల వాళ్లు ఎంతలా స్ట్రగుల్ అవుతారనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. ఇంటర్వెల్ ముందు వరకు 90స్ జ్ఞాపకాల్ని నెమరవేసుకునేలా ఉంటాయి. ఆ తర్వాత మాత్రం పిల్లలు-తల్లిదండ్రుల మధ్య బంధాన్ని చూపించారు. చివర అరగంట అయితే చూస్తున్న మనం కన్నీళ్లు పెట్టుకునేంతలా ఎమోషనల్ అయిపోతాం.'వాళా' అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. పనిపాటా లేకుండా తిరిగే సోమరులని కూడా అదే పేరుతో పిలుస్తుంటారు. అరటి మొక్కని చూపించడంతో మొదలయ్యే ఈ సినిమా.. అరటి తోటని చూపించే సన్నివేశంతో ముగుస్తుంది. అలానే ప్రస్తుత సమాజంలోని ఎంతోమంది కుర్రాళ్లు ఈ సినిమాలో తమని తాము చూసుకోవడం గ్యారంటీ. ఎందుకంటే చాలా సీన్లు అలా కనెక్ట్ అయిపోతాయ్.ఎవరెలా చేశారు?యాక్టర్స్ ఎవరూ మనకు తెలియదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆ ఆలోచన మనకు రాదు. ఎందుకంటే అంత బాగా చేశారు. సినిమాటోగ్రాఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథకి తగ్గట్లు ఉంది. స్నేహం అంటే ఒకరి కోసం ఒకరు ఆవేశపడటం కాదు. అందరూ కలిసి ఓ బలమైన ఆశయం కోసం పట్టుదలతో ముందుకెళ్లడం, కన్నవాళ్ల కళ్లలో సంతోషం చూడటం అనే సందేశాన్ని అంతర్లీనంగా ఈ కథలో ఇచ్చారు. నిడివి కూడా 2 గంటలే. కుటుంబంతో కలిసి చూసే సినిమా ఇది.-చందు డొంకాన


