చిన్న సినిమా ఘన విజయం.. వారం రోజుల్లోనే సెంచరీ | Malayalam Movie Vaazha 2 Crosses Rs 100 cr | Sakshi
Sakshi News home page

రూ.10 కోట్లు పెడితే రూ.100 కోట్లు.. మలయాళంలో హిట్టు కొట్టిన తెలుగు నిర్మాత

Apr 10 2026 2:09 PM | Updated on Apr 10 2026 2:29 PM

Malayalam Movie Vaazha 2 Crosses Rs 100 cr

మలయాళంలో రెండేళ్ల క్రితం సంచలన విజయం సాధించిన చిత్రాల్లో "వాళా" ఒకటి. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.40 కోట్లు వసూలు చేసింది. వాళా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. అలాగే పనీపాటా లేకుండా తిరిగే సోమరులని కూడా అదే పేరుతో పిలుస్తారు. వాళా చిత్రానికి 'బయోపిక్‌ ఆఫ్‌ బిలియన్‌ బాయ్స్‌' అనేది ట్యాగ్‌లైన్‌ ఇచ్చారు.

మలయాళంలో హిట్‌ కొట్టిన తెలుగు డైరెక్టర్‌
2024లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్‌ ఆఫ్‌ బిలియన్‌ బ్రోస్‌' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్‌ దాస్‌ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్‌ మీనన్‌ దర్శకత్వం వహించగా రెండో భాగాన్ని సవిన్‌ డైరెక్ట్‌ చేశాడు. సీక్వెల్‌కు రూ.10 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరిగా ఉన్నాడు. 

సెంచరీ కొట్టిన వాళా 2
ఏప్రిల్‌ 2న విడుదలైన ఈ చిత్రం ఏకంగా సెంచరీ కొట్టింది. కేవలం వారం రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోవడం విశేషం. ఈ ఏడాది మన శంకరవరప్రసాద్‌గారుతో హిట్‌ అందుకున్న సాహు గారపాటి.. మూడు నెలల్లో వాళా 2తో మరో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. కాగా వాళా మొదటి భాగం హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది.

 

 

చదవండి: గాయపర్చుకున్న హీరో.. కదల్లేని స్థితిలో ఉంటే..

Advertisement
 
Advertisement
Advertisement