నేను హీరోయిన్‌గా పనికిరానని అవమానించారు.. ఇప్పుడు.. | Sakshi
Sakshi News home page

Ineya: ఆ దర్శకుడు నేను సినిమాల్లోకి పనికి రానన్నాడు.. ఇప్పుడు రెండు చోట్లా..

Published Thu, Jan 25 2024 12:42 PM

Malayalam Actress Ineya Says Director Insulted Her - Sakshi

ప్రతిభ కలిగిన నటీమణుల్లో నటి ఇనయ ఒకరు. వాంగ చుడవా చిత్రంలో హీరోయిన్‌గా నటించి తానేమిటో నిరూపించుకుందీ బ్యూటీ. మాతృభాష మలయాళం అయినా తమిళంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఇనయ ఎలాంటి పాత్రనైనా చాలెంజ్‌గా తీసుకుని నటించగలదు. ఒక పక్క హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే, మరో పక్క వ్యాపార రంగంలోనూ రాణిస్తోంది. ఈమె అనోరా ఆర్ట్‌ స్టూడియో పేరుతో మహిళా దుస్తుల వ్యాపారాన్ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తోంది. ఈమె ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఏడాదయ్యింది.

బర్త్‌డే సెలబ్రేషన్స్‌
ఈ సందర్భంగా తన షాపు తొలి వార్షికోత్సవాన్ని, తన పుట్టినరోజు వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఈ పార్టీకి పలువురు సినీ ప్రముఖులు, తన సంస్థ సిబ్బంది పాల్గొని ఇనయాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో ఇనయ మాట్లాడుతూ.. తాను హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్‌ మూవీ తుక్కుదురై. ఇందులో యోగిబాబు హీరోగా నటించారు. ఇది వినోదభరిత కథా చిత్రంగా ఉంటుంది.

నేను పనికిరానన్నాడు
ఈ తరహా కామెడీ కథా చిత్రంలో నటించడం నాకు ఇదే తొలిసారి! తొలి రోజుల్లో ఒక దర్శకుడు నేను సినిమాకు పనికి రానని అవమానించారు. అలాంటిది ఇప్పుడు తమిళం, మలయాళం భాషల్లో హీరోయిన్‌గా అలాగే వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాను. నాకు దర్శకత్వం వహించాలని ఆసక్తి ఉంది. అందుకు కథలు కూడా రెడీగా ఉన్నాయి. అయితే డైరెక్టర్‌గా మారడానికి ఇంకా సమయం ఉంది' అని ఇనయ పేర్కొంది.

చదవండి: నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్‌ సేతుపతి థ్రిల్ల‌ర్‌ సినిమా

 
Advertisement
 
Advertisement