
తమిళసినిమా: ఇప్పుడున్న హీరోయిన్లు హీరోలకు ఏమాత్రం తగ్గడం లేదు. చాలా వరకు గ్లామర్ పాత్రలకు పరిమితమైన హీరోయిన్లు ఇప్పుడు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందు కోసం రిస్క్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇటీవల యశోద చిత్రం కోసం నటి సమంత చాలా రిస్కీ ఫైట్స్‌లో నటించారు. అదే విధంగా ఇండియన్–2 చిత్రం కోసం నటి కాజల్ అగర్వాల్ గుర్రపు స్వారి, కత్తి సాము వంటి విద్యల్లో శిక్షణ పొందారు. నటి మాళవిక మోహన్ కూడా ఇప్పుడు అదే బాట పట్టింది. పా .రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తంగలాన్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రాచీన కథాంశాలతో కూడిన చిత్రంలో మాళవిక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈమె నటన దర్శకుడు పా.రంజిత్‌కు సంతృప్తి కలిగించలేదని, దీంతో ఆమెను చిత్రం నుంచి తొలగించాలన్న ఆలోచనతో ఉన్నట్టు ఇటీవల వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. కారణం తంగలాన్ చిత్రంలోని తన పాత్ర కోసం నటి మాళవిక మోహన్ సిలంబాట్టం అనే ప్రాచీన ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతోంది. తను శిక్షణ పొందుతున్న ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అందులో సిలంబం అనే అద్భుతమైన ప్రపంచంలోకి తొలి అడుగు వేశానని నటి మాళవిక మోహన్ పేర్కొంది.
చదవండి:
మాజీ దంపతులు ఐశ్వర్య-ధనుష్ తనయులతో సరదాగా రజనీ, ఫొటో వైరల్
పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు