25 ఏళ్లకే జీవితం అయిపోదు: రూమర్స్‌పై మలైకా ఘాటు రిప్లై

Malaika Arora Shares Note On Normalizing Finding Love In 40s - Sakshi

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ టాక్‌ వినిపిస్తోంది. అర్జున్‌ వయసు 36 కాగా, మలైకాకు 48 ఏళ్లు. వీళ్లిద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అయితే గత కొంత కాలంగా అర్జున్‌ కపూర్‌ మలైకా అరోరా విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తమ నాలుగేళ్ల ప్రేమ బంధానికి త్వరలోనే స్వస్తి పలకనున్నట్లు బీటౌన్‌లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై ఇప్పటికే అర్జున్‌ కపూర్‌ స్పందించిన విషయం తెలిసిందే. మలైకాతో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ తాము విడిపోతున్నట్లు వస్తున్న రూమర్లను కొట్టిపారేశారు.
చదవండి: వైరల్‌ వీడియో: అభిమానుల కోసం బయటకొచ్చిన సూపర్‌స్టార్‌

తాజాగా మలైకా కూడా తమ రిలేషన్‌షిప్‌పై స్పందించింది.  ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్టు పెట్టింది. ‘40 ఏళ్ల వయసులో ప్రేమలో పడటం సాధారణం విషయంగా భావించండి..  మీ 30 ఏళ్ల వయసులో కొత్త కలలను కనుగొని సాధించడాన్ని అంగీకరించండి.. మీ 50 ఏళ్ల వయసులో మిమ్మల్ని, మీ లక్ష్యాన్ని గుర్తుంచడాన్ని అంగీకరించండి. జీవితం 20 ఏళ్లను దాటేసింది.  25 ఏళ్లతో జీవితం ముగియదు. అలా నటించడం మానేద్దాం’ అంటూ పేర్కొన్నారు. ఈ పోస్టుతో ఇద్దరి మధ్య వయసు అంతరంపై ప్రశ్నిస్తున్న వారందరికీ గట్టి సమాధానం ఇచ్చినట్లైంది.
చదవండి: ఆంటీతో డేటింగ్‌ అంటూ ట్రోల్స్‌, తొలిసారి ఘాటుగా స్పందించిన యంగ్‌ హీరో

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top