'గుంటూరు కారం' సాంగ్.. సోషల్ మీడియాలో మళ్లీ మొదలైన ట్రోల్స్! | Sakshi
Sakshi News home page

Mahesh Babu: 'కుర్చీని మడతపెట్టి' సాంగ్.. తమన్‌పై నెటిజన్స్ ట్రోల్స్!

Published Sun, Dec 31 2023 10:38 AM

Mahesh Babu Guntur kaaram Song Trolls On SS Thaman - Sakshi

ప్రస్తుతం సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోన్న సాంగ్ ఒకటే. అదేనండి సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న గుంటూరు కారం చిత్రంలోని పాట. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన 'కుర్చినీ మడతబెట్టి' అనే మాస్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రిన్స్ అభిమానులతో పాటు సినీ ప్రియులను ఊపేస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. 

అయితే ఆడియన్స్ నుంచి ఈ సాంగ్‌కు విశేషణమైన ఆదరణ లభిస్తోంది. ఈ పాటకు తమన్ బాణీలు అందించారు.   టాలీవుడ్‌లో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. తాజాగా మరోసారి తమన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ పాటలోని ఓ ట్యూన్‌ను కాపీ కొట్టారంటూ తెగ వైరల్ చేస్తున్నారు. అత్తారింటికి దారేది చిత్రంలోని 'పేట్రాయి సామీదేవుడా' అనే సాంగ్‌ ట్యూన్‌ కాపీ చేశారంటూ పెద్దఎత్తున వైరలవుతోంది. 

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పెళ్లిసందడి భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.మీనాక్షీ చౌదరి, ప్రకాశ్‌, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

Advertisement
 
Advertisement