మహేశ్ బాబు క్రేజీ లుక్.. కొడుకు వల్ల బయటపడింది! | Sakshi
Sakshi News home page

Mahesh Babu: గౌతమ్ గ్రాడ్యుయేషన్.. మహేశ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published Sun, May 26 2024 6:36 PM

Mahesh Babu Emotional On Gautam's Graduation Day

సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త లుక్‪‌లో కనిపించాడు. సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చాడు. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించట్లేదు. అదే టైంలో రాజమౌళితో చేయబోయే సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే లుక్ విషయంలో బయట కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు మహేశ్ లేటెస్ట్ క్రేజీ మాస్ లుక్ బయటపడింది. అది కూడా కొడుకు గౌతమ్ వల్లే. ఇంతకీ అసలేం జరిగింది?

(ఇదీ చదవండి: ఫైనల్లీ 'కల్కి' షూటింగ్ పూర్తయింది.. వాళ్లందరికీ స్పెషల్ గిఫ్ట్స్)

మహేశ్ బాబు కొడుకు గౌతమ్ తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అలా అని ఇదేదో డిగ్రీనో ఇంజినీరింగో కాదు ఇంటర్మీడియట్ అనమాట. ఈ క్రమంలోనే మహేశ్ భావోద్వేగానికి లోనయ్యాడు. గర్వంతో పొంగిపోతున్నానని, జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానని, కలల్ని అందుకునేందుకు పరుగెత్తాలని, తండ్రికి చాలా గర్వపడుతున్నాని మహేశ్ రాసుకొచ్చాడు.

అయితే ఎన్నడూ లేని విధంగా మహేశ్ గడ్డం, ఒత్తయిన జుట్టుతో కనిపించాడు. బహుశా ఇది రాజమౌళి సినిమా కోసమే మేకోవర్ అయ్యిండొచ్చు. ఇలా ఇప్పుడు గౌతమ్ గ్రాడ్యుయేషన్ వల్ల బయటపడింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఈ పిక్ వైరల్ చేస్తున్నారు. మహేశ్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: నన్ను అలాంటి డ్రెస్సుల్లో ఎవరూ చూడొద్దనుకుంటాను.. కానీ!: జాన్వీ కపూర్)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement