నన్ను అలాంటి డ్రెస్సుల్లో ఎవరూ చూడొద్దనుకుంటాను.. కానీ! | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: వద్దన్నా సరే వస్తారు.. ఫొటోలు తీసి సతాయిస్తారు!

Published Sun, May 26 2024 5:25 PM

Janhvi Kapoor On Paparazzi Taking Photos In Her Gym Wear

జాన్వీ కపూర్.. ఈ పేరు చెప్పగానే అందాలన్నీ ఆరబోసే హీరోయినే గుర్తొస్తుంది. ఎందుకంటే నటిగా ఈమె అంత పెద్ద పేరేం తెచ్చుకోలేదు. కానీ గ్లామర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్‌కి మాత్రం ఎప్పటికప్పుడు పూర్తి న్యాయం చేస్తూనే ఉంటుంది. జాన్వీకి సంబంధించిన చాలా వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో చాలావరకు తన అనుమతి లేకుండా తీస్తున్నారని, వాటి వల్ల తన ఇమేజ్ డ్యామేజ్ అయిపోతోందని అంటోంది.

(ఇదీ చదవండి: ఫైనల్లీ 'కల్కి' షూటింగ్ పూర్తయింది.. వాళ్లందరికీ స్పెషల్ గిఫ్ట్స్)

ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ 'దేవర' మూవీ చేస్తున్న జాన్వీ.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. మరోవైపు ఈమె లేటెస్ట్ హిందీ మూవీ 'మిస్టర్ అండ్ మిసెస్ మహీ'. మే 31న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఈమె తన గురించి చాలా విషయాల్ని బయటపెడుతోంది. అలా తన స్కిన్ షో డ్రస్సలు గురించి కూడా చెప్పింది.

'సినిమా ప్రమోషన్స్ కోసమైతే పపరాజీ(ఫొటోగ్రాఫర్స్)ని పిలుస్తాను. కానీ జిమ్‌కి వెళ్లేటప్పుడు మాత్రం అస్సలు పిలవను. అయినాసరే నన్ను ఫాలో అయి వచ్చేస్తుంటారు. జిమ్ దుస్తుల్లో రకరకాల యాంగిల్స్‌లో నా ఫొటోలు తీస్తుంటారు. జనాలు అలాంటి డ్రెస్సుల్లో చూడొద్దని అనుకుంటాను. ఎందుకంటే తర్వాత వీటిపై వాళ్లు ఎలా పడితే అలా కామెంట్స్ చేస్తారు!' అని జాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది.

(ఇదీ చదవండి: 'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ)

Advertisement
 
Advertisement
 
Advertisement