‘మహాసముద్రం’ వచ్చేది అప్పుడే!

Maha Samudram Movie To Release In Theatres On October 14 - Sakshi

‘మహాసముద్రం’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబరు 14న విడుదల కానుంది. శుక్రవారం ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించి, కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా నటించిన చిత్రం ఇది.
(చదవండి: ప్యాన్‌ ఇండియా సినిమాలకు మమ్మల్ని పిలవరు: పృథ్వీ)

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదితీరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. రావు రమేష్, జగపతిబాబు, ‘కేజీఎఫ్‌’ఫేమ్‌ రామచంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: చైతన్య భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిశోర్‌ గరికపాటి, కో ప్రొడ్యూసర్‌: అజయ్‌ సుంకర.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top