పెళ్లి తర్వాత భర్త వరుణ్ గురించి లావణ్య ఫస్ట్ పోస్ట్! | Lavanya Tripathi First Instagram Post After Married Varun Tej | Sakshi
Sakshi News home page

Varun Tej Lavanya Tripathi: పెళ్లి తర్వాత మెగా కోడలు లావణ్య ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published Sat, Nov 18 2023 7:50 PM | Last Updated on Sat, Nov 18 2023 8:35 PM

Lavanya Tripathi First Instagram Post After Married Varun Tej - Sakshi

మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఇప్పుడు తీరిక దొరికింది. ఇన్నాళ్లు పెళ్లి, ఆ తర్వాత జరిగే కార్యక్రమాలతో తెగ బిజీ అయిపోయిన ఈమె.. తొలిసారి తన భర్త వరుణ్ తేజ్ గురించి మాట్లాడింది. ఆసక్తికర విషయాలు చెబుతూనే పెళ్లి ఫొటోలను కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంతకీ లావణ్య.. భర్త వరుణ్ గురించి ఏం చెప్పింది?

పెళ్లి తర్వాత ఫస్‌ టైమ్
'మిస్టర్' మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో ప్రేమలో పడ్డ వరుణ్-లావణ్య.. దాదాపు ఆరేడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. కానీ తమ లవ్ మేటర్ ఎక్కడా బయటపడకుండా చాలా జాగ్రత్తపడ్డారు. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం జరగడానికి కొన్నిరోజుల ముందు వీళ్ల రిలేషన్ బయటపడింది. తాజాగా నవంబరు 1న వరుణ్-లావణ్య.. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్, డెహ్రాడూన్‌లో రిసెప్షన్ తో కొత్త జంట చాలా బిజీగా గడిపారు. ఇప్పుడు పెళ్లి తర్వాత తొలిసారి లావణ్య ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: వన్డే వరల్డ్‌కప్ ఫైనల్.. ఆ తెలుగు హీరోలందరూ గ్యారంటీగా!)

భర్త గురించి చెబుతూ
తమ పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ.. క్యాప్షన్‍‌లో మాత్రం భర్త వరుణ్ తేజ్ గురించి రాసుకొచ్చింది. 'నా భర్త జాలి, కేరింగ్ ఉన్న ఎంతో అద్భుతమైన మనిషి. ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ వాటిని నాలోనే దాచుకుంటాను. మా మూడు రోజుల పెళ్లి ఎంతో అద్భుతంగా, ఓ కలలా జరిగింది. మమ్మల్ని ఆశీర్వదించి, బెస్ట్ విషెస్ చెప్పిన వాళ్లందరికీ థ్యాంక్యూ' అని లావణ్య రాసుకొచ్చింది.

ఈ పోస్టులోనే మెగా ఫ్యామిలీ, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలని లావణ్య పోస్ట్ చేసింది. అలానే స్పెషల్‌గా డిజైన్ చేయించిన లావణ్య పెళ్లి చీరపై 'వరుణ్ లవ్' అని రాసి ఉన్న పిక్ తో పాటు, కాళ్ల పారాణీ-పట్టీలు ఉన్న ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఈ ఫొటోలపై మెగా ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.

(ఇదీ చదవండి: హీరో ధనుష్ ఇంటికొచ్చిన పోలీసులు? కొడుకు ఆ తప్పు చేయడంతో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement