ఐస్‌బాత్‌ చేస్తున్న తెలుగు హీరోయిన్‌ | Actress Sunaina Ice Bath Yoga Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఐస్‌బాత్‌ చేస్తున్న తెలుగు హీరోయిన్‌

Mar 5 2024 6:56 AM | Updated on Mar 5 2024 8:47 AM

lathi Sunaina Ice Bath Yoga Video Viral - Sakshi

కథానాయకిలకు అందం, ఆరోగ్యం చాలా ముఖ్యం. అందుకోసం వాళ్లు నిరంతరం వ్యాయామం, యోగాలు అంటూ కసరత్తులు చేయడం తప్పనిసరి. అందుకు కొత్త కొత్త యోగాలను కనిపెడుతుంటారు. నటి సునైనా అలాంటి కొత్త యోగాను చేస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు సామాజక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ముందుగా మోడలింగ్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత నటిగా పరిశ్రమకు పరిచయం అయిన అచ్చ తెలుగు అమ్మాయి సునైనా. తమిళంలో కాదలిల్‌ విళిందేన్‌ చిత్రం ద్వారా నటుడు నకుల్‌కు జంటగా కథానాయకిగా పరిచయం అయిన సునైనా తొలి చిత్రం తోనే మంచి విజయాన్ని చవి చూశారు.

ఈ చిత్రం 2008లో విడుదల అయ్యింది. ఆ తరువాత ఈ జంట మాచిలామణి అనే మరో చిత్రంలోనూ నటించారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ అంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత వీరి కలిసి నటించలేదు. కాగా నటి సునైన మాత్రం నీర్‌ పరవై, వంశం వంటి పలు చిత్రాల్లో నటించినా స్టార్‌ డమ్‌ కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు.

ఈమె చివరిగా నటుడు విశాల్‌ సరసన లాఠీ చిత్రంతో పాటు రెజీనా అనే హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రంలో నటించారు. కొన్ని వెబ్‌ సిరీస్‌లోనూ నటించిన సునైనా ఇప్పుడు అరుదైన యోగాసనంతో వార్తల్లో కెక్కారు. ఫిట్‌నెస్‌లో భాగంగా ఈ భామ ఐస్‌ మెడిటేషన్‌ చేస్తుండడం విశేషం. సాధారణంగా ఒంటిలోని నరాలను బలపరచుకోవడం కోసం శరీర బడలికను తగ్గించుకోవడం కోసం ఐస్‌బాత్‌ చేస్తుంటారు. అలాంటిది నటి సునైన మాత్రం ఐస్‌ మెడిటేషన్‌ చేస్తున్నారు. ఒక టబ్‌లో ఐస్‌ ముక్కల నడుమ ఈమె యోగా చేశారు. దీంతో ఈమె మెడిటేషన్‌ చేస్తున్న వీడియో, ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement