Lasya Manjunath: Deepavali Song Amrutha Pranay Special Appearance- Sakshi
Sakshi News home page

Amrutha Pranay: దివాళీ స్పెషల్ సాంగ్‌లో అమృత ప్రణయ్ సందడి చూశారా!

Nov 5 2021 12:10 PM | Updated on Nov 5 2021 2:29 PM

Lasya Deepavali Song Amrutha Pranay Special Appreance - Sakshi

Lasya Manjunath Diwali Special Song:  నటి లాస్య  మంజునాథ్‌ దీపావళి సందర్భంగా ఒక ప్రత్యేక వీడియోను లాంచ్‌ చేసింది.  ఈ వీడియోలో ముఖ్యంగా అమృత ప్రణయ్‌, లాస్యతో కలిసి అడుగులు కలపడం విశేషంగా నిలిచింది. ఇంకా గలాటా గీతూ,  అలేఖ్య కలిసి ఈ అద్భుతమైన వీడియోలో సందడి చేశారు.  నవంబరు 3న ఈ వీడియో పోస్ట్‌  చేయగా ఇప్పటికే 6 లక్షల వ్యూస్‌ దాటేసింది.  ప్రస్తుతం ఈ స్పెషల్‌ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. లాస్య తనదైన స్టెప్పులతో  ఫ్యాన్స్‌ను ఆకట్టుకోగా, తొలిసారి అమృత ఒక స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి అభిమానులను ఫిదా చేసింది.  పింక్‌ డ్రెస్‌లో ముచ్చటగా  కనిపించింది. దీనికి  సంబంధించిన మేకింగ్‌ వీడియోను అమృత  కూడా పోస్ట్‌ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement