నా విధిరాతలో ఇదే ఉందేమో: నటుడు | Kushal Tandon Wishes Gauhar Khan In Flight Shares Video | Sakshi
Sakshi News home page

నేనేమీ తనను వెంటాడటం లేదు: నటుడు

Dec 28 2020 11:26 AM | Updated on Dec 28 2020 2:51 PM

Kushal Tandon Wishes Gauhar Khan In Flight Shares Video - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి, హిందీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గౌహర్‌ ఖాన్‌, కొరియెగ్రాఫర్‌ జైద్‌ దర్బార్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 25న అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిఖా జరిగింది. ఇక వివాహ అనంతరం కొత్త పెళ్లికూతురు గౌహర్‌ ఆదివారం విమానంలో లక్నోకు పయనమయ్యారు. ఈ క్రమంలో అదే విమానంలో  ప్రయాణిస్తున్న ఆమె మాజీ ప్రియుడు, నటుడు కుశాల్‌ టాండన్‌.. ‘‘నేనేమీ తనను వెంటాడం లేదు’’ అంటూ ఓ సరదా వీడియోను షేర్‌ చేశాడు. ‘‘ఓకే గయ్స్‌.. ఈ విచిత్రాన్ని చూడండి! నా గమ్యస్థానాన్ని చేరుకునే ప్రయాణంలో నా పాత మిత్రురాలిని కలుసుకున్నాను. ఇటీవలే తన పెళ్లి జరిగింది. ప్రస్తుతం తను నా పక్కనే కూర్చుంది. మేం అనుకోకుండా కలిశాం. నేనేమీ తన వెంటపడటం లేదు.

తను చాలా అందంగా కనిపిస్తోంది కదా. ఆమె గౌహర్‌ ఖాన్‌. నేను నీకు నేరుగా శుభాకాంక్షలు తెలపాలని విధిరాతలో ఉందేమో’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక గౌహర్‌ సైతం కుశాల్‌ వ్యాఖ్యలకు బదులుగా నవ్వుతూ అతడితో ఫొటోలకు ఫోజులిచ్చారు. కాగా వీరిద్దరు బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అలా కొన్నాళ్లపాటు డేటింగ్‌ చేసిన ఈ జంట ఖత్రోంకి ఖిలాడి 5తో పాటు జరూరీ థా మ్యూజిక్‌ వీడియోలో కలిసి కనిపించారు. అయితే ఏడాదికాలంలోనే విభేదాలు తలెత్తడంతో బ్రేకప్‌ చెప్పుకొన్నారు. ఇక ప్రస్తుతం గౌహర్‌, తాండవ్‌ సినిమాతో బిజీగా ఉండగా, కుశాల్‌ నటించిన అన్‌లాక్‌, బెబాకే వంటి వెబ్‌ సిరీస్‌లు ఈ ఏడాది విడుదలయ్యాయి. (చదవండి: మా ప్రేమకథ చిరస్థాయిగా నిలిచిపోయేలా..)


కుశాల్‌ టాండన్‌- గౌహర్‌ ఖాన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement