kushal
-
కుశాల్ రాజు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే?
కుశాల్ రాజు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్లో డా. లతా రాజు నిర్మిస్తున్నారు. ఇవాళ ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా..మల్లిడి వశిష్ట ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు మల్లిడి కృష్ణ మాట్లాడుతూ.. '2012లో నా జర్నీ మొదలైంది. ఎన్నోమలుపులు తిరిగి మీ ముందుకు డైరెక్టర్‌గా వచ్చాను. లత గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి మంచి నిర్మాత దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఇదొక స్కైఫై డ్రామా మూవీ. ఓటీటీల యుగంలో ఇలాంటి కథను ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలి. రాబోయే ఈవెంట్స్‌లో మరిన్ని వివరాలు వెల్లడిస్తా' అని చెప్పారు. హీరో కుశాల్ రాజు మాట్లాడుతూ..'నా దర్శకుడు కృష్ణకు థ్యాంక్స్ చెప్పాలి. నన్ను హీరోగా పరిచయం చేయడం కోసం మా అమ్మ లత చాలా కేర్ తీసుకున్నారు. వీవీ వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్, మా టీమ్ మొత్తానికి బిగ్ థ్యాంక్స్' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జగపతి బాబు, పృథ్వీరాజ్, వైవా హర్ష, బబ్లూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
వేద + కృత్రిమ మేధ
ఓ సినిమాలో ‘భవిష్యవాణి’ పుస్తకం రేపు ఏం జరుగుతుందనే విషయాన్ని హీరోకు చెప్పేస్తుంది. దాన్ని బట్టి కథానాయకుడు నిర్ణయాలు తీసుకుంటుంటాడు. అచ్చం అలాగే రేపు ఏం జరుగుతుందో చాలా కచ్చితత్వంతో చెప్పేస్తా అంటున్నాడు ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడు. వేదాలకు ఏఐ సాంకేతికతను జోడించిదీన్ని సాధించినట్లు శ్రీకుషాల్ యార్లగడ్డ అనే టెకీ చెబుతున్నాడు. మూడేళ్లుగా ఎన్నోపరిశోధనలు చేసి డెస్టినీ.ఏఐ అనే స్టార్టప్‌ను ఏర్పాటు చేసిన అతను.. అదే పేరుతో ఒక యాప్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాడు. తల్లి భవితపై ప్రయోగాలు.. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీకి చెందిన కృష్ణారావు, కనకదుర్గ దంపతుల పెద్ద కుమారుడు శ్రీకుషాల్ యార్లగడ్డ. చిన్నప్పటి నుంచి చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ఉండే అతను.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం)లో పీజీ చేశాక బెంగళూరులో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే చేసే పని నచ్చక 20 రోజులకే మానేసి ఇంటికొచ్చేశాడు. అప్పటి నుంచి వినూత్నంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తనకు వచ్చిన ఆలోచనలను తల్లితో పంచుకొనేవాడు. భవిష్యత్తును కచ్చితంగా ఎలా అంచనా వేయగలమనే అంశంపై దాదాపు మూడేళ్లపాటు పరిశోధనలు చేపట్టాడు. ఇందుకోసం జ్యోతిష శాస్త్రంకన్నా ఎంతో గొప్పదైన ‘ప్రాణ’ (మనిíÙలోని ఆరు చక్రాలు, నాడులు, కుండలిని) ఆధారంగా భవిష్యత్తుపై పరిశోధనలు ముమ్మరం చేశాడు. ఇందుకోసం 400 కోట్ల డేటా సెట్స్‌తో అల్గారిథమ్ రూపొందించాడు. అందులోని వివరాల ఆధారంగా తన తల్లిపైనే ప్రయోగాలు చేసేవాడు. ఫలానా రోజున జ్వరం వస్తుందని తల్లికి చెప్పగా అన్నట్లుగా ఆమె ఆ రోజున జ్వరం బారిన పడ్డారు. అలాగే ఫలానా రోజున ఒంట్లో నలతగా ఉంటుందని చెప్పిన సందర్భంలోనూ అలాగే జరిగింది. ఇలా 6 నెలలు పరిశీలించాక తాను చెబుతున్న విషయాలు కచి్చతత్వంతో జరగడంతో స్టార్టప్ స్థాపించాలనే ఆలోచనకు వచ్చాడు. ఇదే విషయాన్ని టీ–హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావుకు చెప్పడంతో ఆయన పరిశోధనలు చేసుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి ప్రోత్సహించారు. దీంతో డెస్టినీ.ఏఐ స్టార్టప్‌ను ఏర్పాటు చేసి అదే పేరుతో యాప్ రూపొందించాడు. హోర శాస్త్రం ఆధారంగా.. బృహత్ పరాశరుడు రాసిన హోర శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ప్రతి మనిషిలో ఉండే ‘ప్రాణ’ ఆధారంగా ఈ భవిష్యవాణి చెప్పొచ్చని కుషాల్ వివరించాడు. పూర్వ కాలంలో రాజులు, మంత్రులకు మాత్రమే పండితులు ఈ ప్రాణ లెక్కలు వేసి వారి భవిష్యత్తును అంచనా వేసేవారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు, జనాభాకు ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా లెక్కలు వేయడానికి చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతో కుషాల్ సాంకేతికతను వినియోగించాడు. దీని ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే ఒక వ్యక్తి భవిష్యత్తును కచ్చితత్వంతో చెప్పొచ్చని కుషాల్ అంటున్నాడు. సాధారణ పద్ధతిలో ఒక వ్యక్తి ప్రాణ విశ్లేషణ చేసేందుకు కొన్ని గంటల సమయం పడుతుందని కుషాల్ పేర్కొన్నాడు.ఎలా పనిచేస్తుంది? డెస్టినీ.ఏఐ అప్లికేషన్లో మన పుట్టినతేదీ, సమయం, పుట్టిన ప్రాంతాన్ని ఎంటర్ చేస్తే మెషీన్ మొత్తం విశ్లేషించి రేపటి రోజున ఏం జరుగుతుందనేది చెప్పేస్తుందని కుషాల్ చెబుతున్నాడు. ప్రస్తుతం యాప్ బీటా వెర్షన్లో ఉందని.. దాదాపు 60 శాతం కచ్చితత్వంతో సమాచారం అందిస్తోందని వివరించాడు. సమీప భవిష్యత్తులో యాప్‌ను మరింతగా అభివృద్ధి చేసి 99 శాతం కచ్చితత్వంతో భవిష్యవాణి చెప్పేలా రూపొందిస్తానని కుషాల్ అంటున్నాడు.నిర్ణయాలుతీసుకోవడానికి దోహదం జీవితంలో కీలక నిర్ణయాలుతీసుకొనే విషయంలో ఈ యాప్ ఉపయోగపడుతుందని కుషాల్ అంటున్నాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాలు తెలిస్తే ఆందోళనకు గురికాకుండా అప్లికేషన్లో భవిష్యత్తుతోపాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదనే అంశాలను కూడా మెషీన్ పొందుపరుస్తుందని వివరించాడు. -
ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం
‘కాలంతో పాటు నడవాలి’ అంటారు పెద్దలు.‘కాలంతో పాటు నడుస్తూనే భవిష్యత్‌పై ఒక కన్ను వేయాలి’ అంటారు విజ్ఞులు. అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్... అనే ముగ్గురు మిత్రులు రెండో కోవకు చెందిన దార్శనికులు. లెర్న్ అండ్ ఎర్న్ ప్లాట్‌ఫామ్ ‘ఇంట్రాక్ట్’తో వెబ్3 వరల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు... ఐటీఐ–దిల్లీలో చదువుకున్న అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్ సంభాషణాల్లో సరదా విషయాల కంటే సాంకేతిక విషయాలే ఎక్కువగా చోటు చేసుకునేవి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు? వివిధ దేశాల్లో ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు? ఏ రంగాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మన దేశంలో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు, ఇంటర్నెట్ అభివృద్ధిలో మూడు ప్రధాన దశలు, వెబ్3 టెక్నాలజీతో అపారమైన ఉద్యోగావకాశాలు...ఇలా ఒకటా రెండా బ్లాక్‌చైన్, క్రిప్టో టెక్నాలజీ, వెబ్3 టెక్నాలజీ గురించి గంటల తరబడి మాట్లాడుకునేవారు. వారు మాట్లాడుకున్న విషయాలేవి వృథా పోలేదు.‘ఇంట్రాక్ట్’ ప్లాట్‌ఫామ్‌కు పునాదిగా ఉపయోగపడ్డాయి.ప్రజలకు బ్లాక్ చెయిన్, క్రిప్టో టెక్నాలజీని చేరువ చేయాలనే లక్ష్యంతో 2022లో ‘ఇంట్రాక్ట్’ అనే స్టార్టప్ స్టార్ట్ చేశారు ముగ్గురు మిత్రులు. ‘వెబ్3 టెక్నాలజీకి సంబంధించి కేవలం సమాచార వేదికగానే కాకుండా ప్రతిఫలదాయక వేదికగా ఇంట్రాక్ట్ని నిర్మించాం. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ అనేది ఇంట్రాక్ట్ లక్ష్యం. క్వెస్ట్, ఇంటరాక్టివ్ టాస్కుల ద్వారా బ్లాక్ చెయిన్, క్రిప్టో, వెబ్3 టెక్నాలజీతో యూజర్లను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం’ అంటున్నాడు కో–ఫౌండర్ అభిషేక్.సంక్లిష్టమైన రీతిలో కాకుండా ఫన్ అండ్ ఇంటరాక్టివ్ పద్ధతిలో కొత్త ప్రాడక్టులు, సర్వీసులను యూజర్లకు పరిచయం చేయడంలో ‘ఇంట్రాక్ట్’ విజయం సా«ధించింది. టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేసిన యూజర్లకు క్రిప్టో, ఎన్ఎఫ్టీ, లాయల్టీ పాయింట్స్ రూపంలో ప్రోత్సాహకాలు’ అందిస్తోంది. ఎన్నో కలలతో ముగ్గురు మిత్రులు ‘ఇంట్రాక్ట్’ను ప్రారంభించారు. ఆ కలలకు కష్టాన్ని జోడించారు. ఆ కష్టం వృథా పోలేదు. లక్షలాది యూజర్లతో ‘ఇంట్రాక్ట్’ వెబ్3 వరల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తూప్రాఫిటబుల్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. ‘ఇంట్రాక్ట్’ ఇన్వెస్టర్లలో ఆల్ఫా వేవ్ గ్లోబల్, గుమీ క్రిప్టోస్, ఆల్కెమీ, మూన్ పే, వెబ్ 3 స్టూడియోస్, కాయిన్ బేస్...మొదలైన కంపెనీలు ఉన్నాయి. సమీకరించిన నిధులలో కొంత మొత్తాన్ని తమ టీమ్ సభ్యుల సంఖ్యను రెట్టింపు చేయడానికి, సాంకేతిక అవసరాలకు ఉపయోగించారు. సాధించిన విజయంతో సంతృప్తి పడడం లేదు ముగ్గురు మిత్రులు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వెబ్3 టెక్నాలజీపై మార్కెటింగ్ నిపుణులు, కంపెనీల ఫౌండర్లు దృష్టి పెట్టారు. మరో వైపు ఉద్యోగావశాలు లేదా ఆవిష్కరణల కోణంలో యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో పోటీగా ఎన్నో కంపెనీలు మార్కెట్లోకి రావచ్చు. వాటిని తట్టుకొని ముందుకు వెళ్లాలంటే ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాల గురించి ఆలోచించాలనేది ముగ్గురు మిత్రులకు తెలియని విషయం కాదు.‘వెబ్3 క్రియేట్ చేసిన సరికొత్త ఆర్థిక అవకాశాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థల గురించి పరిచయం చేసి యూజర్లకు ఉపయోగపడాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు సంస్థ కో–ఫౌండర్, సీయీవో సంభవ్ జైన్. -
25 లక్షల నష్టం.. ఇంకా నయం: టీవీ నటుడు
ముంబై: భారీ వర్షాల దాటికి మహారాష్ట్ర వణికిపోతోంది. గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వానలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునగగా... ఎంతో మంది నిరాశ్రయులవుతున్నారు. ఆర్థిక, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ క్రమంలో తాను కూడా వర్షాల కారణంగా భారీగా నష్టపోయినట్లు హిందీ టీవీ నటుడు కుశాల్ టాండన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన రెస్టారెంట్ ధ్వంసమైందని, సుమారు 25 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నాడు. కాగా కుశాల్ టాండన్ 2019లో ‘‘ఆర్బర్ 28’’ పేరిట రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. హార్దిక్ పాండ్యా, సొహైల్ ఖాన్, సిద్ధార్థ్ శుక్లా, లులియా వంటూర్, నియా శర్మ వంటి సెలబ్రిటీలు ఆరంభ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, కొన్ని రోజులు వ్యాపారం బాగానే జరిగినా, కరోనా మహమ్మారి దెబ్బకు రెస్టారెంట్ మూతపడింది. లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నా వర్షాల దాటికి అతడి రెస్టారెంట్ ధ్వంసమైంది. ఈ విషయాల గురించి కుశాల్ మాట్లాడుతూ... ‘‘కోవిడ్ వల్ల వ్యాపారం కుదేలైంది. లాక్డౌన్ కారణంగా రెండుసార్లు రెస్టారెంట్ మూతపడింది. సడలింపులు ఉన్నా.... ఎక్కువ మంది కస్టమర్లు వచ్చేవారు కాదు. ఇప్పుడేమో భారీ వర్షాలు.. రెస్టారెంట్ డ్యామేజ్ అయ్యింది. 23-25 లక్షల నష్టం. ఏం చేయాలో అర్థంకావడం లేదు’’ అని వాపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన కుశాల్... వర్షం కురిసిన సమయంలో వాచ్మెన్, గార్డులు అక్కడ లేకపోవడం మంచిదైందంటూ ప్రస్తుత పరిస్థితులను వివరించాడు. Bhiwandi pic.twitter.com/DwUlwEQNwn — SK (@shaggyskk) July 22, 2021 Seems like Cloudburst here, Mahad South Raigad!!! @IndiaWeatherMan @Hosalikar_KS @SkymetWeather @weatherchannel pic.twitter.com/oorLwWeAMR — Moeen Pangle (@MoeenPangle) July 22, 2021 pic.twitter.com/7x4sh2LRvW — (WFH SINDHI) (@sindhibhoot) July 22, 2021 -
నా విధిరాతలో ఇదే ఉందేమో: నటుడు
ముంబై: బాలీవుడ్ నటి, హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ గౌహర్ ఖాన్, కొరియెగ్రాఫర్ జైద్ దర్బార్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 25న అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిఖా జరిగింది. ఇక వివాహ అనంతరం కొత్త పెళ్లికూతురు గౌహర్ ఆదివారం విమానంలో లక్నోకు పయనమయ్యారు. ఈ క్రమంలో అదే విమానంలో ప్రయాణిస్తున్న ఆమె మాజీ ప్రియుడు, నటుడు కుశాల్ టాండన్.. ‘‘నేనేమీ తనను వెంటాడం లేదు’’ అంటూ ఓ సరదా వీడియోను షేర్ చేశాడు. ‘‘ఓకే గయ్స్.. ఈ విచిత్రాన్ని చూడండి! నా గమ్యస్థానాన్ని చేరుకునే ప్రయాణంలో నా పాత మిత్రురాలిని కలుసుకున్నాను. ఇటీవలే తన పెళ్లి జరిగింది. ప్రస్తుతం తను నా పక్కనే కూర్చుంది. మేం అనుకోకుండా కలిశాం. నేనేమీ తన వెంటపడటం లేదు. తను చాలా అందంగా కనిపిస్తోంది కదా. ఆమె గౌహర్ ఖాన్. నేను నీకు నేరుగా శుభాకాంక్షలు తెలపాలని విధిరాతలో ఉందేమో’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక గౌహర్ సైతం కుశాల్ వ్యాఖ్యలకు బదులుగా నవ్వుతూ అతడితో ఫొటోలకు ఫోజులిచ్చారు. కాగా వీరిద్దరు బిగ్‌బాస్ సీజన్ 7లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అలా కొన్నాళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జంట ఖత్రోంకి ఖిలాడి 5తో పాటు జరూరీ థా మ్యూజిక్ వీడియోలో కలిసి కనిపించారు. అయితే ఏడాదికాలంలోనే విభేదాలు తలెత్తడంతో బ్రేకప్ చెప్పుకొన్నారు. ఇక ప్రస్తుతం గౌహర్, తాండవ్ సినిమాతో బిజీగా ఉండగా, కుశాల్ నటించిన అన్‌లాక్, బెబాకే వంటి వెబ్ సిరీస్‌లు ఈ ఏడాది విడుదలయ్యాయి. (చదవండి: మా ప్రేమకథ చిరస్థాయిగా నిలిచిపోయేలా..) కుశాల్ టాండన్- గౌహర్ ఖాన్ View this post on Instagram A post shared by CelebMantra (@celebmantraofficial) -
సుశాంత్ అన్నలాంటి వాడు.. సిగ్గుపడండి
నటి అంకిత లోఖండే, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దాదాపు ఆరేళ్లుగా ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ‘పవిత్ర రిష్తా’ సీరియల్ సందర్భంగా ప్రారంభమైన వీరి బంధం ఆ తర్వాత విబేధాలు రావడంతో ముగిసిపోయింది. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మీడియా వెబ్సైట్ సుశాంత్‌తో విడిపోయిన తర్వాత అంకిత, కుశాల్ టాండన్ అనే నటుడితో కొన్నాళ్లు డేటింగ్ చేసిందంటూ కథనాన్ని ప్రచురించింది. ఇది కాస్తా హాట్ టాపిక్‌గా మారడంతో కుశాల్ టాండన్ దీనిపై స్పందించారు. సదరు వెబ్‌సైట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశాంత్ తనకు అన్నలాంటి వాడని.. అంకిత మంచి స్నేహితురాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కుశాల్ ట్వీట్ చేశారు. (చదవండి: ట్విన్స్ రాకతో సంతోషం: అంకిత) This is a shame journalism, like really , I was a friend of both ,Sushanth was a brother and @anky1912 a friend , at this time who so ever z team is trying to get my name in this blame game ... plz keep me out of this ....... 😡😡😡😡😡shocking how we live in a world of news 🙏 pic.twitter.com/B65xy737KR — KUSHAL TANDON (@KushalT2803) August 27, 2020 ‘నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఇది జర్నలిజమా.. నేను.. సుశాంత్, అంకితలకు మంచి స్నేహితుడిని. తను నాకు సోదరుడిలాంటివాడు. అంకిత నాకు మంచి స్నేహితురాలు. దయచేసి మీ బ్లేమ్ గేమ్‌లో నన్ను చేర్చకండి. ఇలాంటి వార్తా ప్రపంచంలో ఉన్నందుకు షాక్ అవుతున్నాను’ అంటూ కుశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే సుశాంత్ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలపై కూడా స్పందించారు. సుశాంత్ మృతిని సర్కస్‌లా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కుశాల్ టాండన్. ‘ప్రపంచమా.. దయచేసి తన ఆత్మను ప్రశాంతంగా ఉండనివ్వు. ఇక్కడ జరుగుతున్న సర్కస్ని చూసి స్వర్గంలో ఉన్న ఆ వజ్రం గట్టిగా నవ్వుతుంది. సుశీ. ఎప్పటిలానే వీటన్నింటిని లైట్ తీసుకో. చిల్ అవ్వు’ అంటూ మరో ట్వీట్ చేశారు కుశాల్ టాండన్. (చదవండి: సుశాంత్ ఇంటి ముందు ఆ ‘మిస్టరీ గర్ల్’ ఎవరంటే!) And for the world plz let his soul rest in peace 🙏it’s a circus 🎪 out here and the diamond must be laughing out loud from heaven ..... sushi take lite like u always did ❤️u chil it’s only caos down here 😇you angel 😇 — KUSHAL TANDON (@KushalT2803) August 27, 2020 ఇక కుశాల్‌తో డేటింగ్ వార్తలపై అంకిత స్పందించారు. ‘ఒక అమ్మాయి ఒంటరిగా ఉందంటే చాలు తను ఎవరితో డేటింగ్లో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీ అందరికి ఒక్కటి స్పష్టంగా చెప్తున్నాను. ఎవరితోనే డేటింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు.. సమయం అంతకన్నా లేదు. నా పని నాకు ముఖ్యం. ఇలాంటి వార్తలు చదివి.. స్పందించి.. వివరణ ఇవ్వడం కూడా దండగ’ అన్నారు అంకిత. -
‘పిచ్చి యాప్.. టిక్‌టాక్‌ను నిషేధించండి’
ముంబై: చైనా యాప్ టిక్‌టాక్‌పై భారత్‌లో నిషేధం విధించాలని హిందీ టీవీ నటుడు, బేహద్ ఫేం కుశాల్ టాండన్ పిలుపునిచ్చాడు. పనీపాట లేని వాళ్ల కోసం చైనా ఈ యాప్‌ను తయారు చేసిందని.. తానెప్పుడూ ఈ పిచ్చి యాప్‌ను వాడలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రాణాంతక వైరస్‌ను ప్రపంచం మీదికి వదిలిన చైనాకు టిక్‌టాక్ వాడకంతో భారీ ఆదాయం సమకూరుతోందని.. కాబట్టి భారతీయులు ఈ యాప్‌ను నిషేధించడం ద్వారా ఆ దేశానికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశాడు. చైనాలోని వుహాన్ నగరంలో పురుడుపోసుకున్న ప్రాణాంతక కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచమంతటా విస్తరిస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా కరోనా మరణాలు సంభవించగా.... 20 లక్షల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ముఖ్యంగా అగ్రరాజ్యంలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. అంతేకాదు వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు సైతం అతలాకుతలం అవుతున్నాయి. భారత్‌లోనూ ప్రాణాంతక కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చైనా ఉత్పత్తులు, బ్రాండ్లు, యాప్‌లను నిషేధించాలంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కుశాల్ సైతం ఇదే వాదనను వినిపించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టా పేజ్‌లో చైనా కారణంగా ప్రపంచం అతలాకుతలం అవుతుంటే.. కొంతమంది భారతీయులు మాత్రం ఆ దేశాన్ని ఆదాయాన్ని ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. పనీపాటలేని వాళ్ల కోసమే ఆ యాప్. దానిని వాడనందుకు నేను గర్వపడుతున్నా. ఇప్పటికైనా టిక్‌టాక్‌ను నిషేధించండి’’అని తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ పోస్ట్ పెట్టాడు. ఇక ఈ విషయంలో పలువురు కుశాల్‌కు మద్దతుగా నిలవగా.. వివేక్ దహియా వంటి ఇతర సెలబ్రిటీలు టిక్‌టాక్ కారణంగా కరోనా పుట్టలేదని.. దాని వల్లే కొన్ని అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలబడుతున్నాయని పేర్కొంటున్నారు. అంతేగాకుండా ఎంతో మంది సామాన్యులను సెలబ్రిటీలు చేసిన ఘనత టిక్‌టాక్‌కు ఉందని సుదీర్ఘ పోస్టులు పెడుతున్నారు. (‘చైనా యాప్ టిక్‌టాక్‌ను బహిష్కరించాలి’) -
నన్నెందుకు నిందిస్తున్నారు: నటుడి భార్య
ముంబై: తన భర్త ఆత్మహత్యకు తనను బాధ్యురాలిని చేయడం భావ్యం కాదని నటుడు కుశాల్ పంజాబీ భార్య అడ్రే డోలెన్ అన్నారు. కుశాల్‌తో తనకు అభిప్రాయ భేదాలు తలెత్తిన మాట వాస్తవేమనని... అయితే తన కారణంగా అతడు చనిపోలేదని పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు కుశాల్ పంజాబీ బాంద్రాలోని తన ఇంట్లో ఉరి వేసుకున్న విషయం తెలిసిందే. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసిన కుశాల్.. తన ఆస్తిని తల్లిదండ్రులు, తన కొడుకు కియాన్‌కు సమానంగా పంచాలని లేఖలో కోరాడు. అయితే కుశాల్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడి మృతికి కోడలి వేధింపులే కారణమని ఆరోపించారు. కియాన్‌ను కుశాల్‌కు దూరం చేసిందని.. తరచూ డబ్బులు ఇవ్వాలంటూ వేధించినందు వల్లే కుశాల్ బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన డోలెన్... ‘మా వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయి. అయితే మేం విడిపోవాలని అనుకోలేదు. కియాన్‌ను తన తండ్రి దగ్గరికి వెళ్లకుండా నేను ఏనాడు అడ్డుపడలేదు. నిజానికి కుశాల్‌కు బంధాలపై ఆసక్తి లేదు. నన్ను, నా కొడుకును ఏనాడు లెక్కచేయలేదు. ప్రస్తుతం నేను షాంఘై(చైనా)లో ఉద్యోగం చేస్తున్నాను. చెప్పాలంటే కుశాల్ ఖర్చులు కూడా నేనే భరిస్తున్నా. అపార్థాలు తొలగించుకునేందుకు తనను ఇక్కడకు రావాలని కోరాను. కుశాల్‌తో బంధాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాను. కానీ ఇప్పుడు నాపై నిందలు వేస్తున్నారు. ఉద్యోగరీత్యా నేను షాంఘైలో ఉండటం కుశాల్‌కు ఇష్టం లేదు. లండన్‌కు షిఫ్ట్ అవుదామన్నాడు. కానీ జాబ్ వదులుకోవడం నాకు ఇష్టం లేదు. కొడుకు భవిష్యత్తు గురించి శ్రద్ధలేని కుశాల్‌ను నమ్మాలనుకోలేదు. నేను, కియాన్ క్రిస్మస్ సెలవుల కోసం ఫ్రాన్స్‌లో ఉన్నపుడు ఇలా జరిగింది’ అని వివరణ ఇచ్చారు. (‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ ) కాగా ఫియర్ ఫాక్టర్, నౌటికా నావిగేటర్స్ ఛాలెంజ్, ఝలక్ దిఖ్లా జా తదితర రియాలిటీ షోల్లో పాల్గొన్న కుశాల్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఫర్హాన్ అక్తర్ లక్ష్యా, కరణ్ జోహార్ కాల్ సినిమాలతో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అతడికి 2015లో డోలెన్‌తో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు కియాన్ ఉన్నాడు. ఇక డిసెంబరు 26న కుశాల్ ఆత్మహత్యకు పాల్పడిన క్రమంలో విచారణకు హాజరుకావాలంటూ డోలెన్‌కు పోలీసులు నోటీసులు పంపించారు. -
అగ్రస్థానంలో కుశాల్
సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నమెంట్లో కోవిద్ కుశాల్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరుగు తోన్న ఈ టోర్నీలో మూడు రౌండ్లు ముగిసేసరికి 3 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి తొలి స్థానాన్ని పంచుకున్నాడు. శనివారం జరిగిన జూనియర్స్ మూడోరౌండ్ గేమ్‌లో సాయి అఖిల (2)పై కుశాల్ (3), నిగమశ్రీ(2)పై సూర్య (3), పి. వరుణ్ (2)పై ఆరుషి (3) గెలుపొందారు. అభిరామ్ (2.5)తో సాయి (2.5), ప్రజ్ఞేశ్ (2.5)తో సహస్రాన్షి (2.5) తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. ఓపెన్ కేటగిరీలో మూడోరౌండ్‌లోనూ సాయిరాజ్ (2)పై మల్లేశ్వర రావు (3), ఫయాజ్ (2)పై పీవీవీ శిభు (3), అభిరామ్ (2)పై శ్రీనివాస్ (3), సాయి కిరణ్ (2) ఫణి (3) గెలిచారు. -
మూడో రౌండ్లో కుషాల్, వివేక్
సాక్షి, హైదరాబాద్: బోడెపూడి శ్రీకాంత్ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో కుషాల్, వివేక్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు.ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఖమ్మం జిల్లా టీటీ సంఘం, గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారుు. క్యాడెట్ బాలుర విబాగంలో శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో జి. వివేక్ సారుు (హెచ్‌వీఎస్) 11-9, 7-11, 11-6, 11-6తో తరుణ్ యాదవ్ (స్టాగ్ అకాడమీ)పై గెలుపొందగా... గ్లోబల్ టీటీ అకాడమీకి చెందిన కుషాల్ 11-7, 7-11, 11-9, 11-7తో అగస్త్య (ఎల్బీఎస్)ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో త్రిశూల్ మెహ్రా (ఎల్బీఎస్) 13-11, 8-11, 11-8, 10-12, 11-8తో వరుణ్ అమర్నాథ్ (జీఎస్ఎం)పై, రిత్విక్ (స్టాగ్ అకాడమీ) 11-4, 11-7, 11-8తో ఆయూష్ (ఏడబ్ల్యుఏ)పై, ప్రకీత్ (ఏడబ్ల్యుఏ) 11-7, 15-13, 7-11, 11-8తో శ్రేష్ట్ (ఏడబ్ల్యుఏ)పై, జతిన్ (ఎస్పీహెచ్ఎస్) 11-6, 11-9, 11-5తో క్షితిజ్ మల్పానీ (హెచ్‌వీఎస్)పై, వేణు మాధవ్ (జీఎస్ఎం) 11-8, 11-9, 12-10తో ఇషాంత్ (ఏడబ్ల్యుఏ)పై గెలుపొందారు. మరోవైపు సబ్ జూనియర్ విభాగంలో రఘురామ్, ఆయూష్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలిరౌండ్లో రఘురామ్ (నల్గొండ) 11-4, 11-8, 11-9తో శ్రేష్ట్ (ఏడబ్ల్యుఏ)పై, ఆయూష్ (ఏడబ్ల్యుఏ) 11-9, 6-11, 11-7, 11-2తో హర్ష్ భట్నాగర్‌పై విజయం సాధించారు. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు ఎ. నరసింహారెడ్డి, కార్యదర్శి పి. ప్రకాశ్‌రాజు పాల్గొన్నారు. సబ్ జూనియర్ బాలుర తొలి రౌండ్ ఫలితాలు: కుషాల్ (జీటీటీఏ) 11-7, 11-5తో రాఘవ్ (హెచ్‌వీఎస్)పై, రాజు (ఏడబ్ల్యుఏ) 11-2, 11-2, 11-2తో మణి (వరంగల్)పై, శ్రేయస్ (హెచ్‌వీఎస్) 11-9, 13-11, 9-11, 13-11తో అథర్వ (ఏడబ్ల్యుఏ)పై, రిత్విక్ (స్టాగ్ అకాడమీ) 11-4, 12-10, 11-5తో ప్రీతమ్ (నల్గొండ)పై, విశాల్ (జీఎస్ఎం) 11-4, 11-8, 11-3తో రిత్విక్ రోషన్ (వరంగల్)పై, ఆర్య భట్ (హెచ్‌వీఎస్) 11-8, 11-9, 14-12తో ప్రకేత్ (ఏడబ్ల్యుఏ)పై, శ్రీరంగ (హెచ్‌వీఎస్) 11-5, 11-4, 13-11తో నిత్యన్ రెడ్డి (నల్గొండ)పై, సారుునాథ్ రెడ్డి (హెచ్‌వీఎస్) 11-2, 11-1, 11-2తో మహేశ్(ఆదిలాబాద్)పై, ఆగస్త్య (ఎల్బీఎస్) 11-9, 13-11, 9-11, 11-3తో హితేన్ సారుు (ఎస్పీహెచ్ఎస్)పై, ఇషాంత్ (ఏడబ్ల్యుఏ) 11-3, 11-6, 11-5తో మధుకర్ (ఆదిలాబాద్)పై, ప్రణవ్ (ఏడబ్ల్యుఏ) 11-0, 11-1, 11-1తో చక్రవర్తి (వరంగల్)పై విజయం సాధించారు. -
కుషాల్ ఓ ఇడియట్ : అమీషా
సోషల్ మీడియా మంచికి ఎంత ఉపయోగపడుతుందో, అంతకు మించి చెడు కూడా చేస్తుంది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో కొంత మంది సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు వ్యక్తిగత దూషణలకూ కారణం అవుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. టీవీ ఆర్టిస్ట్ కుషాల్ బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ మీద చేసిన కామెంట్స్, తరువాత అమీషా ఆ కామెంట్స్‌పై స్పందించిన తీరు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వివాదానికి తెరతీసింది. అమీషా జుహులోని పివిఆర్ థియేటర్లో సినిమా చూస్తుండగా తను చూసిన విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు కుషాల్. థియేటర్లో జాతీయగీతం వస్తున్న సమయంలో ఓ అమ్మాయి గౌరవసూచకంగా నిలబడకుండా కూర్చొని ఉందని, ఆమె వికలాంగురాలేమో అనుకున్నానని, కాని ఆమె అమీషా పటేల్ కావటంతో ఆశ్యర్యపోయానని కుషాల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించింది అమీషా. తను ఆడవాళ్లకు ఉండే వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆరోజు థియేటర్లో లేచి నిలబడలేదని, ఈ సమస్యను అర్థం చేసుకోలేని కుషాల్ ఓ ఇడియట్ అంటూ ఘాటుగా స్పందించింది. కుషాల్‌కు తల్లి, చెల్లి లేరేమో అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆడవాళ్ల వ్యక్తిగత విషయాలు, సమస్యలను పట్టించుకోని కుషాల్ లాంటి వారి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలంటూ ట్వీట్ చేసింది అమీషా. pic.twitter.com/RDhOa0J5R9 — KUSHAL TANDON (@KushalT2803) October 23, 2015 pic.twitter.com/UeSeF2tUHP — KUSHAL TANDON (@KushalT2803) October 23, 2015 Idiot kushal Tandon had the nerve to tweet that I didn't get up during national anthem. Did the jackass ask why? — ameesha patel (@ameesha_patel) October 26, 2015 Women we all need to slap kushal. I had the monthly girly problem. Getting up wud have caused a blood flow on the theatre ground — ameesha patel (@ameesha_patel) October 26, 2015 I waited for the film to start so I cud address my GirLY problem in the bathroom. Didn't know that kushal wud make it a national issue — ameesha patel (@ameesha_patel) October 26, 2015 Assholes like kushal who invade the privacy of a woman n their problems need 2 b slapped.idiot culdnt even win big boss — ameesha patel (@ameesha_patel) October 26, 2015 -
కుశాల్ సంచలనం
శ్రీవత్సకు షాక్ ఆసియా జూనియర్ టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో రాష్ట్ర సీడెడ్ క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. బాలుర క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ శ్రీవత్స రాతకొండకు క్వాలిఫయర్ కుశాల్ చేతిలో పరాజయం ఎదురైంది. బాలికల ఈవెంట్లో మూడో సీడ్ సాయి దేదీప్య, ఆరోసీడ్ శ్రీవల్లి రష్మికలు కూడా ఇంటిదారి పట్టగా... నాలుగో సీడ్ శివాని అమినేని సెమీఫైనల్లోకి ప్రవేశించింది. లియోనియా రిసార్ట్స్‌లోని ఇండోర్ టెన్నిస్ కోర్టులో బుధవారం జరిగిన అండర్-14 బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో క్వాలిఫయర్ యెడ్ల కుశాల్ 6-3, 7-5తో టాప్ సీడ్ శ్రీవత్సపై సంచలన విజయం సాధించాడు. తీర్థ శశాంక్ 6-0, 7-5తో ప్రలోక్ ఇక్కుర్తిపై, హిమాన్షు మోర్ 3-6, 6-3, 6-2తో సచిత్ శర్మపై, నీల్ గరుద్ 6-2, 6-1తో రిత్విక్ చౌదరిపై గెలిచారు. బాలికల క్వార్టర్స్‌లో శివాని 6-3, 4-6, 6-3తో షాజిహా బేగంపై, మహక్ జైన్ 6-1, 6-2తో శ్రీవల్లి రష్మికపై, షేక్ హుమేర బేగం 6-0, 6-2తో సాయి దేదీప్యపై గెలుపొందారు. బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మహక్-దేదీప్య జోడి 6-1, 6-1తో శరణ్య-మాన్య ద్వయంపై, నేహ-స్వాతి జంట 6-4, 7-5తో గౌరి-కృతిక జోడిపై, పాన్యభల్లా-శ్రీవల్లి ద్వయం 6-0, 6-1తో గుల్స్ ్రబేగం-తహూరా షేక్ జంటపై, శివాని-శ్రావ్య జోడి 7-5, 6-1తో షేక్ హుమేర-షాజిహా బేగం ద్వయంపై విజయం సాధించాయి.