‘మా లవ్‌స్టోరీని గుండెలపై లిఖించుకుంటున్నాం’ | Gauahar Khan Shares Adorable Pics Pre Wedding Celebrations | Sakshi
Sakshi News home page

మా ప్రేమకథ చిరస్థాయిగా నిలిచిపోయేలా..

Dec 24 2020 8:00 PM | Updated on Dec 24 2020 8:20 PM

Gauahar Khan Shares Adorable Pics Pre Wedding Celebrations - Sakshi

ముంబై: ‘‘మా కుటుంబ సభ్యులు, స్నేహితులు.. అన్నింటికీ మించి ఆ అల్లాహ్‌ ఆశీర్వాదంతో.. మా ప్రేమ కథను ఇరువురి గుండెలపై చిరస్థాయిగా నిలిచిపోయేలా లిఖించుకుంటున్నాం’’ అంటూ తమ మధుర క్షణాలకు సంబంధించిన విశేషాలను నటి గౌహర్‌ ఖాన్‌(37) అభిమానులతో పంచుకున్నారు. ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో మెరిసిపోతున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కాగా టీవీ స్టార్‌ గౌహర్‌, కొరియోగ్రాఫర్‌ జైద్‌ దర్బార్‌(25) శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇరు కుటుంబాల సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరుగనుంది. ఈ మేరకు ఇరువురు తమ సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించారు. (చదవండి: తనే నా గర్ల్‌ ఫ్రెండ్‌, త్వరలోనే పెళ్లి : హీరో)


 
కాగా మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన గౌహర్‌ ఖాన్‌ ది ఖాన్‌ సిస్టర్స్‌ షోతో గుర్తింపు దక్కించుకున్నారు. రాకెట్‌ సింగ్‌, గేమ్‌, ఇష్క్‌జాదే వంటి సినిమాల్లో నటించారు. అంతేగాక హిందీ బిగ్‌బాస్‌ 7లో పాల్గొన్న ఆమె.. ది ఆఫీస్‌, ఝలక్‌ దిఖల్‌ ఆజా వంటి రియాలిటీ షోల్లో కూడా మెరిశారు. ఇక జైద్‌ దర్బార్‌ ప్రముఖ బాలీవుడ్‌ కంపోజర్‌ ఇస్మాయిల్ దర్బార్ కుమారుడన్న సంగతి తెలిసిందే. అతడు కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement