కృతిశెట్టి బెల్లీ డ్యాన్స్‌... వైరల్‌ హిట్‌! | Sakshi
Sakshi News home page

కృతిశెట్టి బెల్లీ డ్యాన్స్‌... వైరల్‌ హిట్‌!

Published Sat, Feb 10 2024 9:00 AM

Krithi Shetty Belly Dance Viral - Sakshi

'ఉప్పెన'తో తెలుగులోకి అడుగుపెట్టి భారీ విజయాన్ని అందుకుంది కృతిశెట్టి . ఆ తర్వాత వరసగా విజయాలు అందుకున్న ఆ నాయికను ఈ ఏడాది మాత్రం పరాజయాలే పలకరించాయి. తాజాగా ఆమె మలయాళ చిత్రసీమలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బంగార్రాజు, శ్యాంసింగరాయ్ చిత్రాలతో పర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన కస్టడీ ,మాచర్ల నియోజకవర్గం,వారియర్‌ వంటి చిత్రాలు పెద్దగా మెప్పించలేదు. దీంతో ఆమె తమిళ్‌,కన్నడ చిత్రాలపై ఆసక్తి చూపింది. అక్కడ పలు అవకాశాలు దక్కించుకుని దూసుకుపోతుంది.

తెలుగులో శర్వానంద్‌తో ఒక సినిమాలో నటిస్తుండగా తమిళ్‌లో లవ్‌ టుడే చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న  ప్రదీప్ రంగనాథన్‌కు జోడీగా కృతిశెట్టి నటిస్తుంది. ఆపై మలయాళంలో కూడా ఒక సినిమా ఒప్పుకుంది. దీంతో ప్రస్తుతం ఆమె మళ్లీ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. 

ఫ్యాన్స్‌ కోసం ఎప్పుడూ టచ్‌లో ఉండే బేబమ్మ తాజాగా బెల్లీ డ్యాన్స్‌ వీడియోతో యూత్‌ మతులు పోగొడుతుంది. విజయ్‌ బీస్ట్‌ సినిమాలోని అరబిక్ కుతు సాంగ్ కు బెల్లీ డాన్స్ చేసింది ఈ బ్యూటీ. తన అందంతో పాటు టాలెంట్‌ను కూడా చూపి అందరినీ మెస్మరైజ్‌ చేసింది. కృతిశెట్టి చేసిన బెల్లీ డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

Advertisement
 
Advertisement