Krishnam Raju : కృష్ణంరాజుకు కడసారి వీడ్కోలు.. ఆయన చేతుల మీదుగా దహన సంస్కారాలు

Krishnam Raju Last Rites At Moinabad Latest Updates - Sakshi

Krishnam Raju Last Rites At Moinabad Latest Updates:

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. ఆశ్రునయనాల మధ్య ఆయనకు కుటుంబసభ్యులు తుది వీడ్కోలు పలికారు. ప్రభాస్‌ అన్నయ్య ప్రభోద్‌ చేతుల మీదుగా దహన సంస్కారాలు నిర్వహించారు.

►ప్రారంభమైన అంత్యక్రియలు
ప్రముఖ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ప్రారంభమయ్యాయి. తమ అభిమాన నటుడ్ని కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే కేవలం కుటుంబసభ్యులు, బంధుమిత్రలను మాత్రమే ఫామ్‌హౌజ్‌లోకి అనుమతించారు. ఇక కృష్ణంరాజుకు ప్రభాస్‌తో పాటు మిగతాకుటుంబసభ్యులు కడసారి వీడ్కోలు పలికారు.

.

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు అంతిమ యాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి మెయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌కు అంతిమ యాత్ర మొదలైంది. కడసారి చూపు కోసం ఆయన అభిమానులు దారిపొడవునా ఎదురుచూస్తున్నారు. 

మొయినాబాద్‌ మండలంలోని కనకమామిడిలో కృష్ణంరాజు ఫామ్‌హౌజ్‌లోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభాస్‌ సోదరుడు ప్రభోద్‌ చేతుల మీదుగా దహన సంస్కారాలు జరగనున్నాయి. ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణంరాజు కడసారి చూపుకోసం భారీగా అభిమానులు తరలివస్తున్నారు.

ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ముందు జాగ్రత్తగా అంత్యక్రియలకు కేవలం కుటుంసభ్యులు,బంధువులకు మాత్రమే అనుమతినిస్తున్నారు. ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు తొలుత భావించినా, పండితుల సూచన మేరకు  ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం జరగాల్సిన అంత్యక్రియలను సాయంత్రానికి మార్చారు. ప్రభాస్‌ అన్నయ్య ప్రభోద్‌ చేతుల మీదుగా సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. 

► మొయినాబాద్‌ కనకమామిడిలో ఉన్న ఫాంహౌజ్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి.

► ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న కృష్ణంరాజు అంత్యక్రియలు. 

► బీఎన్‌ఆర్‌ కాలనీ బ్రిడ్జ్‌, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ మీదుగా అంతిమయాత్ర సాగనుంది.

► అప్పా జంక్షన్‌ మీదుగా మొయినాబాద్‌కు అంతిమయాత్ర చేరుకుంటుంది.

► దారిపొడవునా ఉన్న రెబల్‌స్టార్‌ ఫ్యాన్స్‌.. పూలు జల్లుతూ నివాళులర్పిస్తున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top