Sai Prasseda: నాన్న, అన్నయ్య నటించిన ఈ సినిమాతో మాకెన్నో జ్ఞాపకాలున్నాయి

Krishnam Raju Daughter Sai Praseeda About Billa Re Release - Sakshi

రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు మృతిని డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభాస్‌ కూడా ఈ బాధ నుంచి ఇంకా బయటపడలేకపోతున్నాడు. అటు సినీప్రియులు వీరిమధ్య అనుబంధాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు ఇద్దరూ కలిసి నటించిన సినిమాల గూర్చి మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో వీరి కలయికలో వచ్చిన బిల్లా మరోసారి థియేటర్లలో రిలీజ్‌ కానుంది.

ప్రస్తుతం హీరోల బర్త్‌డేలకు వారి హిట్‌ సినిమాలను 4కెలో థియేటర్లలో రీరిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే కదా! అక్టోబర్‌ 23న ప్రభాస్‌ పుట్టినరోజును పురస్కరించుకుని బిల్లాను మళ్లీ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణంరాజు కుమార్తె సాయి ప్రసీద, కమెడియన్‌ అలీ, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, దర్శకుడు మెహర్‌ రమేశ్‌, సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొన్నారు.

తండ్రి మరణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన సాయి ప్రసీద మాట్లాడుతూ... 'బిల్లా చిత్రంతో మాకెన్నో జ్ఞాపకాలున్నాయి. గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్‌లో నాన్న, అన్నయ్య కలిసి నటించిన తొలి చిత్రమిది. ఇది నాన్నకు చాలా ఇష్టమైన మూవీ. ఈ చిత్రాన్ని 4కెలో రీరిలీజ్‌ చేస్తున్నందుకు మెహర్‌ రమేశ్‌ అంకుల్‌కు థాంక్యూ. ఈ స్పెషల్‌ షోల ద్వారా వచ్చే లాభాలను యూకే ఇండియా డయాబెటిక్‌ ఫుడ్‌ ఫౌండేషన్‌కు అందిస్తాం. ఇందులో నాన్న భాగస్వామిగా ఉన్నారు. ఫ్యాన్స్‌ ఈ మూవీని మళ్లీ థియేటర్లో చూసి ఎంజాయ్‌ చేస్తారని అనుకుంటున్నా' అని చెప్పుకొచ్చింది.

చదవండి: గీతూ వల్ల నరకయాతన, బాలాదిత్య భార్య ఏమందంటే?
ఆ ఫొటో చూసి పెళ్లయిందా? అంటూ ప్రశ్నల వర్షం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top