Naga Shaurya: Krishna Vrinda Vihari Teaser Release On 28th March - Sakshi
Sakshi News home page

Naga Shaurya's Movie Teaser: ‘కృష్ణ వ్రిందా విహారి’ టీజర్‌ వచ్చేస్తుంది

Mar 27 2022 8:02 AM | Updated on Mar 27 2022 10:42 AM

Krishna Vrinda Vihari Teaser Release On 28th March - Sakshi

నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా రాధిక కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్‌ ఆర్‌. కృష్ణ దర్శకత్వం వహించారు. శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 22న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ని స్టార్ట్‌ చేసింది చిత్రయూనిట్‌. ఇందులో భాగంగా మార్చి 28న టీజర్‌ని విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్‌ని వదిలింది చిత్రబృందం. 

 ‘‘రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా నటించారు. ఈ చిత్రిం షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. మార్చి 28న విడుదల చేసే టీజర్‌ తప్పకుండా అందరికి నచ్చుంది’అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అలనాటి నటి రాధిక ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతమందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement