థియేటర్లో కలుద్దాం | KothiKommachi Movie Launch | Sakshi
Sakshi News home page

థియేటర్లో కలుద్దాం

Dec 15 2020 6:03 AM | Updated on Dec 15 2020 6:03 AM

KothiKommachi Movie Launch - Sakshi

సమీర్, రిద్ధీ, మేఘా చౌదరి, శశాంక్‌

మేఘాంశ్‌ శ్రీహరి, సమీర్‌ వేగేశ్న హీరోలుగా, రిద్ధీ కుమార్, మేఘా చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కోతి కొమ్మచ్చి’. వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో లక్ష్య ప్రొడక్షన్స్‌ సంస్థపై ఎం.ఎల్‌.వి. సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా వేగేశ్న సతీష్‌ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. నవంబర్‌ 3న షూటింగ్‌ మొదలు పెట్టి, డిసెంబర్‌ మొదటి వారానికి ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తి చేశాం. కరోనా భయం ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకొని అవుట్‌డోర్‌లోనే షూటింగ్‌ చేశాం. అమలాపురం, విశాఖపట్నం, రాజమండ్రిలో నిర్విరామంగా షూటింగ్‌ జరిపాం. త్వరలోనే మిగిలిన పాట పూర్తి చేసి, సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘సతీష్‌గారు పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌తో పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ప్రేక్షకులను థియేటర్స్‌లో కలుసుకుంటాం’’ అన్నారు ఎం.ఎల్‌.వి. సత్యనారాయణ.

Advertisement
 
Advertisement
Advertisement