సిగ్నల్ లేదు.. సాయం కోసం హీరో ఎదురుచూపులు! | Sakshi
Sakshi News home page

Vishnu Vishal: ఇంటినిండా నీళ్లు.. ఫోన్ సిగ్నల్ లేదు.. సాయం కోరిన హీరో!

Published Tue, Dec 5 2023 1:35 PM

kollywood Hero Vishnu Vishal Stuck In Chennai Floods Today - Sakshi

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. సముద్ర తీర ప్రాంతం వద్ద భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అధికారులు అప్రమత్తమైన సహాయ చర్యలు చేపడుతున్నారు. చెన్నై నగరం నీటి ముంపునకు గురై జనజీవనం స్తంభించింది. అయితే తుపాన్‌ దెబ్బకు చెన్నైతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ నటుడు విష్ణు విశాల్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

(ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. సీఐడీ నటుడు మృతి!)

తాను వరదల్లో చిక్కుకున్నట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. కారప్పాకంలోని తమ ఇంట్లోకి నీరు చేరిందని.. సాయం కోసం వేచి కాల్ చేశానని తెలిపారు. విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేవని పేర్కొన్నారు. ఇంటి పైకప్పు పైకి రావడంతో సిగ్నల్ దొరకడంతో పోస్ట్ చేశానన్నారు. నాతో ఎంతోమంది సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు ట్వీట్‌లో ప్రస్తావించారు. విష్ణు విశాల్ ప్రస్తుతం రజినీకాంత్ లాల్ సలాం, ధనుశ్ డీ50 చిత్రాల్లో నటిస్తున్నారు. 

(ఇది చదవండి: సలార్‌తో పోటీ పడలేం.. అందుకే డేట్ మార్చాం: టాలీవుడ్ నిర్మాత)

Advertisement
 
Advertisement
 
Advertisement