Kolli Ramakrishna: టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా కొల్లి రామకృష్ణ..

Kolli Ramakrishna Elected To Telugu Film Chamber President - Sakshi

Kolli Ramakrishna Elected To Telugu Film Chamber President: తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) నూతన అధ్యక్షునిగా కొల్లి రామకృష్ణ ఎన్నికయ్యారు. టీఎఫ్‌సీసీ అధ్యక్షునిగా ఉన్న నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ అనారోగ్యంతో ఈ నెల 19న మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం జరిగిన ‘టీఎఫ్‌సీసీ’ కార్యవర్గ సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నియమ నిబంధనలు అనుసరించి ఉపాధ్యక్షుడైన కొల్లి రామకృష్ణ (మెసర్స్‌ రిథమ్‌ డిజిటల్‌ థియేటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌)ను తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ ఏడాది జూలై 31వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

1946 జులై 27న జన్మించిన నారాయణ దాస్‌ నారంగ్‌ (76) ఏప్రిల్‌ 19, 2022న మరణించారు.  గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఏషియన్‌ మల్టీప్లెక్స్‌ , ఏషియన్‌  థియేటర్స్‌ అధినేతగా ఉన్న ఆయన.. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 

చదవండి: ఏషియన్ థియేటర్స్ అధినేత కన్నుమూత

చదవండి: బర్త్‌డే గర్ల్‌ సమంత వద్ద ఉన్న ఈ కాస్ట్‌లీ వస్తువులు తెలుసా ?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top