కోడిబాయె లచ్చమ్మది | Sakshi
Sakshi News home page

కోడిబాయె లచ్చమ్మది

Published Fri, Sep 29 2023 12:55 AM

Kodi Bhaye Lachammadi song from Ala Ninnu Cheri movie launched by Minister Talasani Srinivas Yadav - Sakshi

దినేష్‌ తేజ్, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాల పాటి శ్రీధర్‌ సమర్పణలో మారేష్‌ శివన్‌ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్‌ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని మాస్‌ సాంగ్‌ ‘కోడిబాయె లచ్చమ్మది..’ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘యంగ్‌ టాలెంట్‌ తీసే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు.

ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలి. సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. సుభాష్‌ ఆనంద్‌ స్వరపరచిన ‘కోడిబాయె..’ పాటను మంగ్లీ పాడగా, భాను నృత్యరీతులు సమకూర్చారు. ‘‘ఈ పాటలో దినేష్‌ తేజ్, హెబ్బా పటేల్‌ల మాస్‌ స్టెప్స్‌ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తెలంగాణ నుంచి మరో జానపదం చార్ట్‌ బస్టర్‌గా నిలవనుంది. సినిమాలోని అన్ని పాటలనూ చంద్రబోస్‌ గారు రాశారు ’’ అని యూనిట్‌ పేర్కొంది.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement