breaking news
Mass Songs
-
కోడిబాయె లచ్చమ్మది
దినేష్ తేజ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాల పాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని మాస్ సాంగ్ ‘కోడిబాయె లచ్చమ్మది..’ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘యంగ్ టాలెంట్ తీసే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలి. సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ‘కోడిబాయె..’ పాటను మంగ్లీ పాడగా, భాను నృత్యరీతులు సమకూర్చారు. ‘‘ఈ పాటలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్‌ల మాస్ స్టెప్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తెలంగాణ నుంచి మరో జానపదం చార్ట్ బస్టర్‌గా నిలవనుంది. సినిమాలోని అన్ని పాటలనూ చంద్రబోస్ గారు రాశారు ’’ అని యూనిట్ పేర్కొంది. -
మళ్లీ ట్యూన్ అయ్యారు
చిరంజీవి సినిమా అంటే అభిమానులకు ఒకటో రెండో మాస్ పాటలు ఉండాల్సిందే. అయితే ఇటీవల విడుదలైన ‘సైరా’ కథలో ఆ స్కోప్ లేదు. అందుకే తన తాజా చిత్రంలో ఆ కొరతను తీర్చనున్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని సమాచారం. చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’లో ‘రామ్మా చిలకమ్మా..’, ‘ఇంద్ర’లో ‘దాయి దాయి దామ్మా..’, ‘జై చిరంజీవా’లో ‘జై జై గణేశా.. జై కొడతా గణేశా..’ వంటి సూపర్ హిట్ పాటలను ఇచ్చిన మణిశర్మ తాజా చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సంగీత చర్చలు విదేశాల్లో జరుగుతున్నాయిని టాక్. చిరంజీవి–మణిశర్మ కాంబినేషన్లో మరో హిట్ ఆల్బమ్ వస్తుందని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తారు. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలవుతుందట. -
మాస్ సాంగ్స్‌కే ప్రాధాన్యం ఇస్తా..
సినిమాకు సంగీతం ప్రాణం. సంగీత బాణీలతో కూడిన పాటలు ఆహ్లాదకరం. వీటికి సృష్టికర్త సంగీత దర్శకుడు. మనకు ఇళయరాజా వంటి ఎందరో ప్రముఖ సంగీత దర్శకులు ఉన్నారు. వారి స్ఫూర్తితో మరెందరో సంగీతదర్శకులుగా ఎదుగుతున్నారు. అలాంటి వారి లో సి.సత్య ఒకరు. తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు పొందిన సంగీత దర్శకుల్లో ఈయన ఒకరు. కర్ణాటక సంగీత కుటుంబం నుంచి వచ్చిన సత్య సంగీత దర్శకుడు మాత్రమే కా దు, హార్మోనిస్ట్, కీ బోర్డు ప్లేయర్, మంచి గాయకుడు కూడా. భరద్వాజా లాంటి పలువురు సంగీత దర్శకుల వద్ద శిష్యరికం చేసిన అనుభవంతో ఎంగేయుం ఎప్పోదుం చిత్రంతో సం గీత దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుని తన సంగీత ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన సత్య తీయవేలై సేయనుమ్ కుమారు, నెడుంశాలై,ఇవన్ వేరమాదిరి, కథై తిరైకథై వచనం ఇయక్కయ్ తదితర చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతే కాదు సంథింగ్ సంథింగ్ అనే చిత్రంతో తెలుగులోనూ పరిచయం అయ్యారు. తాజాగా ఈయన సంగీతాన్ని అందించిన వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. చిత్రంలోని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లంభించడంతో ఆనందంలో మునిగి తేలుతున్న సత్యతో చిన్న భేటీ.. ప్ర: వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ చిత్ర విజయానికి సంగీతం పక్కా బలంగా నిలిచిందని భావిస్తున్నారా? జ: కచ్చితంగా. చిత్రం కంటే ముందే ఇందులోని పాటలు ప్రేక్షకాదరణ పొందాలి. అంటే చిత్ర విజయంలో ఆడియో భాగం అయినట్లేగా. ప్ర: చిత్ర దర్శకుడు ఎళిల్‌తో తొలిసారిగా కలిసి పనిచేసిన అనుభవం? జ: చాలా మంచి అనుభవం. అయితే ఆయన కంపోజింగ్ సమయంలో ఒకటి రెండు సార్లు మాత్రమే పాల్గొన్నారు. నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అందుకే మరింత బాధ్యతగా పని చేశాను. రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. చిత్ర కథానాయకుడు, నిర్మాత విష్టువిశాల్ కూడా పాటలు బాగా వచ్చాయని ఆనందంగా ఫీల్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ప్ర: వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ చిత్రంలో ఎక్కువగా ఫాస్ట్ బీట్తో కూడిన మాస్ పాటలకే ప్రాముఖ్యత నిచ్చినట్లున్నారు? జ: నిజం చెప్పాలంటే నాకు మెలోడీ అంటే చాలా ఇష్టం. అయితే ఈ చిత్ర కథకు మాస్ పాటలు అవసరం అయ్యాయి. అవి విశేష ఆదరణను పొందడంతో ఇకపై కూడా మాస్ సాంగ్స్‌కే ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను. ప్ర: ఏ ప్రముఖ సంగీతదర్శకుడి ప్రభావం అయినా మీపై ఉంటుందా? జ: ప్రభావం అంటూ ఏమీ ఉండదుగానీ ఇసైజ్ఞాని ఇళయరాజా స్ఫూర్తి మాత్రం ఉంటుంది. ఆయన సంగీతం వింటూ ఎదిగిన వాడిని ఆయనలా కొత్తగా బాణీలు కట్టాలని ప్రయత్నిస్తుంటాను. ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? జ: రెండు చిత్రాలు చేస్తున్నాను. త్వరలో పార్తీబన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సంగీతాన్ని అందించనున్నాను.