మళ్లీ ట్యూన్‌ అయ్యారు

Chiranjeevi and Koratala Siva film backdrop revealed - Sakshi

చిరంజీవి సినిమా అంటే అభిమానులకు ఒకటో రెండో మాస్‌ పాటలు ఉండాల్సిందే. అయితే ఇటీవల విడుదలైన ‘సైరా’ కథలో ఆ స్కోప్‌ లేదు. అందుకే తన తాజా చిత్రంలో ఆ కొరతను తీర్చనున్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయని సమాచారం.

చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’లో ‘రామ్మా చిలకమ్మా..’, ‘ఇంద్ర’లో ‘దాయి దాయి దామ్మా..’, ‘జై చిరంజీవా’లో ‘జై జై గణేశా.. జై కొడతా గణేశా..’ వంటి సూపర్‌ హిట్‌ పాటలను ఇచ్చిన మణిశర్మ తాజా చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సంగీత చర్చలు విదేశాల్లో జరుగుతున్నాయిని టాక్‌. చిరంజీవి–మణిశర్మ కాంబినేషన్‌లో మరో హిట్‌ ఆల్బమ్‌ వస్తుందని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తారు. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలవుతుందట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top