Ramesh Koduri : 'మీటర్‌లో కిరణ్‌ అబ్బవరంది వైవిద్యమైన పాత్ర.. సెకండాఫ్‌లో అలా ఉంటుంది'

Kiran Abbavaram Meter Director Ramesh Koduri Latest Interview - Sakshi

‘మీటర్‌’ మంచి ఎంటర్‌టైనర్‌. తండ్రీ కొడుకుల మధ్య మంచి ఎమోషన్‌ ఉంటుంది. సినిమా అంతా ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది’’ అని డైరెక్టర్‌ రమేష్‌ కడూరి అన్నారు. కిరణ్‌ అబ్బవరం, అతుల్యా రవి జంటగా రూపొందిన చిత్రం ‘మీటర్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 7న విడుదలకానుంది.

ఈ సందర్భంగా రమేష్‌ కడూరి మాట్లాడుతూ– ‘‘నాది విజయనగరం జిల్లా గరివిడి మండలం. దర్శకులు బాబీ, గోపీచంద్‌ మలినేనిగార్ల వద్ద సహాయ దర్శకుడిగా చేశాను. ‘మీటర్‌’తో దర్శకుడిగా పరిచయమవుతున్నాను. కరోనా లాక్‌ డౌన్‌ తర్వాత ‘మీటర్‌’ ఓకే అయ్యింది. ఈ మూవీలో కిరణ్‌ వైవిధ్యమైన పోలీసాఫీసర్‌ పాత్ర చేశారు.

సెకండాఫ్‌లో ఓ పది నిమిషాలు ఆయన పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ఆ పది నిముషాలు థియేటర్‌లో రఫ్ఫాడిస్తాడు. ఈ సినిమాకి సాయి కార్తీక్‌ నెక్ట్స్‌ లెవల్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. అనుకున్నదానికంటే బడ్జెట్‌ ఎక్కువైనా వెనకడుగు వేయని చెర్రీ, రవిశంకర్, నవీన్‌గార్లకు రుణపడి ఉంటాను’’ అన్నారు. – రమేష్‌ కడూరి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top