కిచ్చా సుదీప్‌ 3డీ మూవీ.. రిలీజ్‌ ఎప్పుడంటే ? | Kicha Sudeep 3D Movie Vikrant Rona Release Date Out | Sakshi
Sakshi News home page

Vikrant Rona Movie: కిచ్చా సుదీప్‌ 3డీ మూవీ.. రిలీజ్‌ ఎప్పుడంటే ?

Dec 8 2021 8:41 AM | Updated on Dec 8 2021 9:58 AM

Kicha Sudeep 3D Movie Vikrant Rona Release Date Out - Sakshi

Kicha Sudeep 3D Movie Vikrant Rona Release Date Out: కన‍్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్, నిరూప్‌ భండారి, నీతా అశోక్, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ ప్రధాన పాత్రధారులుగా అనూప్‌ భండారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. జాక్‌ మంజునాథ్, షాలిని మంజునాథ్, అలంకార్‌ పాండియన్‌ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న విడుదల కానుంది. మంగళవారం విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘మిస్టరీ థ్రిల్లర్‌గా త్రీ డీ టెక్నాలజీతో రూపొందించిన ‘విక్రాంత్‌ రోణ’ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ప్రపంచానికి సరికొత్త సూపర్‌ హీరోను పరిచయం చేస్తున్నాం. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమా విజువల్‌ ట్రీట్‌లా ఉంటుంది. దాదాపు 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’అని చిత్రబృందం పేర్కొంది. 

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌, గ్లింప్స్‌ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. ఇందులో కిచ్చా సుదీప్.. ఫాంటమ్ అనే స్టైలిష్ బైక్‌తో క‌నిపిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఇస్తూ అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చారు. ఇప్పుడు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌డంతో త్రీ డీ మూవీగా విక్రాంత్ రోణ ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎద‌ురుచూస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement