కర్రమ్‌ కుర్రమ్‌

Kiara Advani to play the face of Lijjat Papad in Ashutosh Film - Sakshi

కర్రమ్‌ కుర్రమ్‌ అనగానే అప్పడాలు గుర్తుకు రాకమానవు. ‘లిజ్జత్‌ పాపడ్‌’ అనే పాపులర్‌ అప్పడాల చైన్‌ గుర్తుకు రాకుండానూ ఉండదు. కొంతమంది మహిళలు కలసి స్వయం ఉపాధిలో భాగంగా ఏర్పాటు చేసిన చైన్‌ ఇది. ఈ కథను సిల్వర్‌ స్క్రీన్‌ మీదకు తీసుకురాబోతున్నారు ప్రముఖ దర్శకులు అశుతోష్‌ గోవారీకర్‌. ‘లగాన్, స్వదేశ్‌’ వంటి సినిమాలు తెరకెక్కించిన ఆయన ప్రస్తుతం ఈ లిజ్జత్‌ పాపడ్‌ కథతో సినిమా నిర్మించనున్నారు. ‘కర్రమ్‌ కుర్రమ్‌’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో కియారా అద్వానీ లీడ్‌ రోల్‌లో నటించనున్నారు. ఈ సినిమాలో అప్పడాలు తయారు చేసే అమ్మాయి పాత్రలో కియారా కనిపిస్తారు. గ్లెన్‌ బరెట్టో, అన్కుష్‌ మొహ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top