Khiladi Movie Twitter Review: Ravi Teja Khiladi Movie Twitter Review In Telugu - Sakshi
Sakshi News home page

Khiladi Twitter Review: ఖిలాడీ ట్విటర్‌ రివ్యూ, ఎలా ఉందంటే?

Feb 11 2022 9:39 AM | Updated on Feb 11 2022 10:29 AM

Khiladi Movie Twitter Review In Telugu - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ తాజాగా నటించిన చిత్రం ఖిలాడీ. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి హీరోయిన్లు. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడ్డాక ప్రమోషన్ల స్పీడు పెంచి సినిమాకు హైప్‌ తెచ్చింది చిత్రయూనిట్‌. అదృష్టాన్ని కాకుండా కష్టాన్నే నమ్ముతానన్న రవితేజ ఈ సినిమా విజయాన్ని అందుకోవడం తథ్యమని ఎంతో ధీమాగా ఉన్నాడు.

కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ కమర్షియల్‌ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 11న) థియేటర్లలో రిలీజైంది. మరి ఈ సినిమా హిట్టయ్యిందా? ఫట్టయ్యిందా? ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్‌ చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కథ ఎలా ఉంది? ఎవరెలా చేశారు? హిట్టా? యావరేజా? పలు అంశాలను ట్వీట్ల రూపంలో తెలియజేస్తున్నారు. అవేంటో ఓ సారి చూసేద్దాం..

ఖిలాడీ యావరేజ్‌ సినిమా అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం సూపర్‌ హిట్‌ బొమ్మ అని పొగిడేస్తున్నారు. ఫస్టాఫ్‌ అంతా రొటీన్‌ కామెడీతో సాగిందని, పెద్దగా కొత్త కంటెంట్‌ ఏం లేదని పెదవి విరుస్తున్నారు. ఇటలీ చేజింగ్‌ సీన్‌లో కెమెరా వర్క్‌ తప్ప  అంతా రోతనే కనిపిస్తుందని విమర్శిస్తున్నారు. కొన్ని సాంగ్స్‌ మాస్‌ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతాయని, దేవిశ్రీప్రసాద్‌ మిగతా సాంగ్స్‌ కూడా అదిరిపోయేలా ఇచ్చుంటే బాగుండేదంటున్నారు. మొత్తంగా ఖిలాడి సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వస్తున్నట్లు కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement