Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ సినిమాలపై నిషేధం..!

Kerala Theater Owners Ban on Dulquer Salman Movies - Sakshi

మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటించిన 'సెల్యూట్‌' చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే . ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌తో ఈ చిత్రంపై మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అయితే ఈ సినిమాను ఈనెల 18న సోనీ LIVలో నేరుగా విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు. ఇందులో దుల్కర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

ఇక ఇదిలా ఉండగా దుల్కర్ సల్మాన్ సినిమాలపై కేరళ థియేటర్ ఓనర్స్ నిషేధం విధించారు. దుల్కర్ నటించిన అన్ని చిత్రాలను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్‌కు రెడీగా ఉన్న 'సెల్యూట్‌' చిత్రంలో దుల్కర్‌ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తొలుత థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మూవీమేకర్స్ అనౌన్స్‌ చేశారు. కానీ అలా చేయకుండా ఓటిటీలో విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇక దీనిపై ఆగ్రహించిన థియేటర్ ఓనర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top