సన్నీ లియోన్‌ కేసు విచారణపై కేరళ హైకోర్టు స్టే

Kerala High Court Stayed Case Against Sunny Leone Further Proceedings - Sakshi

కొచ్చి: బాలివుడ్‌ నటి సన్నీ లియోన్‌కి కోజికోడ్‌లో ఒక స్టేజ్‌ షోకి సంబంధించిన కేసు విషయంలో భారీ ఊరట లభించింది. ఆమెపై నాలుగేళ్ల క్రితం కోజికోడ్‌లో స్టేజ్‌ ఫెర్ఫార్మెన్స్‌కి  ఒప్పందం విషయమై నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ మేరకు నమోదైన కేసులో తదుపరి చర్యలపై కేరళ హైకోర్టు స్టే విధించింది.

సన్నీ లియోన్‌పై కోజికోడ్‌లో రంగస్థల ప్రదర్శన కోసం ఒక సంస్థలో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలను ఉల్లఘించారంటూ కార్యక్రమ నిర్వహకుడు షియాస్‌ కుంజుమహమ్మద్‌ నాలుగేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐతే సన్నీ లియోన్‌ తనపై దాఖలైన ఎఫ్‌ఆర్‌ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయడంతో జస్టిస్‌ జియాద్‌ రెహమాన్‌ విచారణ నిలిపేశారు.

ఈ మేరకు సన్నీ లియోన్‌ పిటిషన్‌లో..తాను, తన భర్త, తమ ఉద్యోగిపై వచ్చి ఆరోపణలను తిరస్కరించారు. ఇప్పటి వరకు తాము ఎలాంటి నేరాలకు పాల్పడలేదని వివరించారు. అలాగే తమను అరెస్టు చేసే విధంగా పోలీసులుకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అందువల్ల వారు ఏమి చేయలేకపోయారని చెప్పారు.

తమను దీర్ఘకాలం విచారణ ఎదుర్కొనేలా చేయడంతో తమకు కోలుకోలేని నష్టం వాటిల్లందని వాపోయారు. ఐతే ఆమెపై ఎర్నాకులంకి చెందిన కార్యక్రమ నిర్వాహాకుడు షియాస్‌ కుంజుమహమ్మద్‌ ఫిర్యాదు మేరకు క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. షియాస్‌ సన్నిలియోన్‌ విదేశాలలో స్టేజ్‌ షోల ప్రదర్శనకు సుమారు రూ. 39 లక్షలు అదుకుని మరీ ఒప్పందం ఉల్లంఘించారంటూ కోర్టు మెట్లెక్కారు.

(చదవండి: ఆప్‌ అభ్యర్థి కిడ్నాప్‌!...అంతా చేస్తోంది బీజేపీనే: సిసోడియా)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top