Keerthy Suresh Emotional About Saani Kaayidham Movie Completed in One Year - Sakshi
Sakshi News home page

Keerthy Suresh: అసలు కీర్తీ సురేశ్‌కు ఏమైంది.. ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్!

May 7 2023 1:15 PM | Updated on May 7 2023 2:25 PM

Keerthy Suresh Emotional About Saani Kaayidham Movie Completed One year - Sakshi

మహానటి కీర్తి సురేశ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. సావిత్రి బయోపిక్‌ మహానటి మూవీతో ఆ పేరే బ్రాండ్‌గా మారిపోయింది. ఇటీవల నేచురల్ స్టార్ నానితో జంటగా నటించిన దసరా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ మూవీ భోళాశంకర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

(ఇది చదవండి: ఆయన టైం వేస్ట్ చేశారు.. డైరెక్టర్‌పై నాగచైతన్య కామెంట్స్ వైరల్)

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న కీర్తి తాజాగా చేసిన పోస్ట్ వైరలవుతోంది. మొహామంతా గుర్తు పట్టలేనంతగా మారిపోయిన  ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఇంతకీ కీర్తీ సురేశ్‌కు ఏమైందోనని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అసలేం జరిగిందో ఓ లుక్కేద్దాం.  

అయితే గతేడాది కీర్తీ సురేశ్, సెల్వ రాఘవన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'సాని కాయిదం'. అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 6, 2022న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. తాజాగా ఈ మూవీ రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా కీర్తి సురేశ్ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. షూటింగ్‌లో పడిన కష్టాలను వివరిస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. అయితే కీర్తి సురేశ్ డేడికేషన్‌ చూసిన ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం మహానటికే ఇలా చేయడం సాధ్యమవుతుందంటూ పోస్టులు పెడుతున్నారు.

(ఇది చదవండి: స్టార్ హీరోయిన్.. అయినా ఒక్క సినిమా సక్సెస్ కాలేదు.. మళ్లీ అదే కథ!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement